Home రాజకీయాలు ‘ఎన్టీఆర్ కథానాయకుడు’పై వర్మ సంచలన కామెంట్స్

‘ఎన్టీఆర్ కథానాయకుడు’పై వర్మ సంచలన కామెంట్స్

SHARE

దర్శకుడు రామ్ గోపాల్ వర్మ ‘లక్ష్మీస్ ఎన్టీఆర్’ సినిమాను తెరకెక్కిస్తున్న సంగతి తెలిసిందే. తాజాగా క్రిష్ దర్శకత్వంలో విడుదలైన ‘ఎన్టీఆర్-కథా నాయకుడు’ సినిమా కంటే ఎన్టీఆర్, చంద్రబాబుపై మాజీ సీఎం నాదెండ్ల భాస్కరరావు ఇచ్చిన ఇంటర్వ్యూకు ఎక్కువ హిట్లు వస్తున్నాయని సెటైర్లు వేశారు.

ఈరోజు వర్మ ట్విట్టర్ లో స్పందిస్తూ..‘ఓవైపు ఎన్టీఆర్ సినిమాలను ఫేమస్ చేసే ప్రయత్నంలో మేమంతా ఉంటే, నాదెండ్ల భాస్కరరావు అంతకంటే ఎక్కువ ఫేమస్ అయిపోయారు. నాదెండ్ల భాస్కరరావు యూట్యూబ్ ఛానల్ కు ఇచ్చిన ఇంటర్వ్యూకు వస్తున్న హిట్లు, కథానాయకుడు సినిమా కలెక్షన్లను మించిపోతున్నాయి. దేవుడు, ప్రజలు.. ఎవరూ జరగబోయేదాన్ని అంచనా వేయలేరు అనడానికి ఇదే సాక్ష్యం’ అని ట్వీట్ చేశారు.