Home సినిమా సైలెన్స్ లో అనుష్క పాత్ర ఇదే..!

సైలెన్స్ లో అనుష్క పాత్ర ఇదే..!

SHARE

బాహుబలి 2 తరువాత అనుష్క మరో సినిమా చేయలేదు.  సాధారణంగా ఒక సినిమా సూపర్ హిట్టయ్యాక.. ఆ సినిమాలో నటించిన వాళ్లకు ఆఫర్లు వరసగా వస్తుంటాయి.  అనుష్కకు కూడా ఆఫర్లు వచ్చినా ఆమె ఎందుకనో ఓకే చెప్పలేదు.  లేడీ ఓరియంటెడ్ సినిమాల కోసం చూస్తుందేమో.  అరుంధతి, భాగమతి, రాణి రుద్రమదేవి సినిమాలు హిట్ కావడంతో ఆ తరహా సినిమాలు చేయాలని అనుకుంటుందేమో మరి.

కోన వెంకట్ నిర్మాణంలో హేమంత్ మధుకర్ దర్శకత్వంలో ఓ థ్రిల్లింగ్ సినిమా ప్లాన్ చేశారు.  ఆ సినిమాలో నటించేందుకు అనుష్క కూడా ఒకే చెప్పేసింది.  పక్కా స్క్రిప్ట్ వర్క్ కూడా సిద్ధం అయినట్టు సమాచారం.  ఇందులో అనుష్క ఓ దివ్యాంగరాలి పాత్రలో కనిపిస్తుందని సమాచారం.  ఇందులో హాలీవుడ్ స్టార్ నటుడు  మైఖేల్ మాడ్సన్ విలన్ పాత్రలో కనిపిస్తున్నాడట.  మార్చి నుంచి షూటింగ్ ప్రారంభం అవుతుంది.  ఎక్కువభాగం షూటింగ్ అమెరికాలో ఉంటుందని తెలుస్తోంది.