Home రాజకీయాలు ‘పచ్చ’ కథలే చెబుతున్న పవన్ కల్యాణ్!

‘పచ్చ’ కథలే చెబుతున్న పవన్ కల్యాణ్!

SHARE

ఒకవైపు చంద్రబాబు నాయుడుతో పొత్తు పెట్టుకునే ప్రసక్తే లేదని అంటూ.. మరోవైపు చంద్రబాబు నాయుడుకు అనుకూలంగా మాట్లాడుతూ ఉన్నాడు పవన్ కల్యాణ్. చంద్రబాబు నాయుడు పాలన గురించి పవన్ కల్యాణ్ గట్టిగా ధ్వజమెత్తడం లేదిప్పుడు. ఎంతసేపూ జగన్ మోహన్ రెడ్డి మీదే మాట్లాడుతూ ఉన్నాడు. ఇది వరకే పవన్ కల్యాణ్ పలుసార్లు జగన్ కు ఏవేవో చాలెంజ్ లు విసిరాడు.

జగన్ మోహన్ రెడ్డే ఏపీకి ముఖ్యమంత్రి అన్నట్టుగా ఉన్నాయి పవన్ కల్యాణ్ సవాళ్లు. అలాగే జగన్ ప్రజలతో చేసిన వ్యాఖ్యలను వక్రీకరిస్తూ ఉన్నాడు పవన్ కల్యాణ్.

పాదయాత్ర ముగింపు సందర్భంగా జగన్ మాట్లాడుతూ.. తనకు ఒక్కసారి ప్రజలు అవకాశం ఇస్తే.. మూడు దశాబ్దాల పాటు తన పాలనే ఉండాలనేంత అద్భుతంగా పాలిస్తా అని అన్నాడు. జగన్ తన గురించి ప్రజలకు అలా చెప్పుకున్నాడు. ఏ రాజకీయ నేత అయినా ఇలాగే చెప్పుకుంటాడు. అయితే జగన్ వ్యాఖ్యలను పవన్ వక్రీకరించాడు.

జగన్ మూడు దశాబ్దాల పాటు తనకే అవకాశం ఇవ్వాలని అన్నాడని పవన్ అంటున్నాడు. జగన్ ఎక్కడా అలా అనలేదు. ఒక్కసారి అవకాశం ఇవ్వాలని అన్నాడు. అది తప్పు అయినట్టుగా పవన్ వక్రీకరణలు ఉన్నాయి.

తెలుగుదేశం పార్టీ వాళ్లు జగన్ మాటలను ఎలా వక్రీకరిస్తూ ఉంటారో…జనసేన అధిపతి కూడా అదే విధంగావక్రీకరిస్తూ ఉన్నాడు. తను కూడా పచ్చ బ్యాచ్ అని నిరూపించుకుంటున్నాడు.