Home రాజకీయాలు ఈ నెలలోనే సీట్ల లెక్కలు తేల్చేసుకుంటున్నారట!

ఈ నెలలోనే సీట్ల లెక్కలు తేల్చేసుకుంటున్నారట!

SHARE

పవన్ కల్యాణ్ ముందు గట్టిగానే సీట్లను డిమాండ్ చేస్తున్నాయి కమ్యూనిస్టు పార్టీలు. తమ రెండు పార్టీలకూ కలిసి అరవై సీట్లు ఇవ్వాలని ఈ పార్టీలు జనసేన అధిపతి ముందు ప్రతిపాదన పెట్టినట్టుగా తెలుస్తోంది. మొత్తం సీట్లలో దాదాపు మూడో వంతు సీట్లను ఈ రెండు పార్టీలూ అడుగుతున్నాయి.

గత మూడు దశాబ్దాల్లో ఉమ్మడి ఏపీ చరిత్రలో కూడా ఉభయ కమ్యూనిస్టు పార్టీలూ కలిసి అరవై సీట్లకు పోటీ చేసిన చరిత్ర లేదు. అయినా కూడా ఈ పార్టీలు ఏకంగా 60 సీట్లు తమకు కావాలని పవన్ కల్యాణ్ ను అడుగుతున్నాయి. పవన్ కల్యాణ్ ముందు కాబట్టి అంత నంబర్ ను వీళ్లు వినిపించగలుగుతున్నారు.

జనసేన స్థాయిని వీరు అలా తగ్గించి చూపిస్తున్నారు. అసలు రాష్ట్రం విడిపోయాకా కమ్యూనిస్టుపార్టీలకు ఏపీలో ఎక్కడైనా క్యాడర్ ఉందా అనేది పెద్ద డౌట్. 2009లోనే వీళ్లు టీడీపీతో పొత్తుపెట్టుకుని చిత్తు అయిపోయారు. ఆ పార్టీ మద్దతు కూడా సీట్లు సాధించుకోలేకపోయారు. అలాంటిది ఇంకా ఈ పార్టీలకు క్యాడర్ ఉందంటే నమ్మకాలు కలగడం లేదు.

అయితే పవన్ దగ్గర మాత్రం వీళ్లు ప్రతాపం చూపిస్తున్నారు. తమకు అరవై సీట్లు ఇవ్వాలని అంటూనే.. ఈ నెల 20 వతేదీలోగా సీట్ల విషయంలో తేల్చుకుంటామని..వీళ్లు చెబుతున్నారు. మొత్తానికి కమ్యూనిస్టు పార్టీలు చాలా ఉత్సాహంతోనే ఉన్నాయి. ఇక పవన్ ఏం తేలుస్తాడో చూడాలి!