Home రాజకీయాలు కాంగ్రెస్ ఆశలపై చంద్రబాబు నీళ్లు..!

కాంగ్రెస్ ఆశలపై చంద్రబాబు నీళ్లు..!

SHARE

తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు కాంగ్రెస్ పార్టీ ఏపీ లీడర్లకు, అటు ఆ పార్టీ అధిష్టానానికి గట్టి ఝలక్ ఇచ్చినట్టుగా తెలుస్తోంది. పొత్తు విషయంలో ఆశలు పెట్టుకున్న కాంగ్రెస్ పార్టీకి అడియాసలను మిగులుస్తూ పొత్తుల ప్రసక్తే లేదని చెప్పాడట చంద్రబాబు నాయుడు.

తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ వాళ్లు చంద్రబాబుకు సీట్లను కేటాయిస్తున్న తరుణంలో.. అక్కడ ఎన్ని సీట్లు ఇస్తే అంతకు రెట్టింపు ఏపీలో ఇవ్వాలని షరతు విధించారట. అయితే అలాంటి షరతలూ, ఒప్పందాలను గౌరవించడానికి అక్కడ ఉన్నది ఎవరో కాదు.. చంద్రబాబు నాయుడు. ఏపీలో కాంగ్రెస్ పార్టీకి సీట్లు కేటాయిస్తే తన పార్టీలో తిరుగుబాటు వస్తుంది.

అంతే కాదు..కాంగ్రెస్ తో పొత్తు వల్ల టీడీపీకి మరింత నష్టం కూడా జరగవచ్చు. కాంగ్రెస్- టీడీపీల పొత్తును తెలుగు జనాలు ఒప్పుకోరని తెలంగాణ ఎన్నికల ఫలితాలతోనే స్పష్టం అయ్యింది. దీంతో చంద్రబాబు నాయుడు కాంగ్రెస్ ను పక్కన పెట్టేయడానికే డిసైడ్ అయినట్టుగా తెలుస్తోంది.

కాంగ్రెస్ పార్టీ ఏపీలో సోలోగా పోటీ చేయాలని.. తద్వారా ప్రభుత్వ వ్యతిరేక ఓటును ఎంతో కొంత మేర చీల్చాలని చంద్రబాబు నాయుడు ఆశిస్తున్నాడు. అప్పుడే మీరు జగన్ ను కూడా దెబ్బ కొట్టినట్టుగా అవుతుందని రాహుల్ గాంధీకి కథలేవో చెప్పి.. ఏపీలో పొత్తు లేకుండా చూసుకుంటున్నాడట చంద్రబాబు నాయుడు.

అయితే ఏపీ కాంగ్రెస్ పార్టీ లీడర్లు మాత్రం.. టీడీపీతో పొత్తు ఉండాల్సిందే అంటూ రాహుల్ గాంధీకి వివరించినట్టుగా తెలుస్తోంది.ఇక ఈ కథ ఏమవుతుందో!