Home రాజకీయాలు అఖిలప్రియ వర్సెస్ చంద్రబాబు..ఎవరు గెలుస్తారు!

అఖిలప్రియ వర్సెస్ చంద్రబాబు..ఎవరు గెలుస్తారు!

SHARE

తెలుగుదేశం పార్టీలో పొందలేకపోతోంది మంత్రి అఖిలప్రియ.తండ్రి మరణించడంతో ఈమెకు చంద్రబాబు నాయుడు మంత్రి పదవిని ఇచ్చాడు. నంద్యాల బై పోల్ నుఉద్దేశించే చంద్రబాబు నాయుడు అఖిలప్రియకు మంత్రి పదవిని ఇచ్చాడనేది బహిరంగ రహస్యం.

ఇక నంద్యాల బై పోల్ తర్వాత నంద్యాల, ఆళ్లగడ్డ రాజకీయంలో రకరకాల పరిణామాలు చోటు చేసుకొంటూ ఉన్నాయి. ఇలాంటి నేఫథ్యంలో అఖిలప్రియకు అక్కడ చాలా మంది శత్రువులు తయారయ్యారు. భూమా నాగిరెడ్డి బతికి ఉన్న రోజుల్లో వీళ్లకు సన్నిమితంగా ఉండిన ఏవీ సుబ్బారెడ్డి కూడా అఖిలప్రియ అంటే పడనట్టుగా వ్యవహరిస్తున్నాడు.

అతడు ఆళ్లగడ్డ టికెట్ అడుగుతున్నాడు. ఇక ఈ మధ్యనే అఖిలప్రియ తీరును నిరసిస్తూ పలువురునేతలు టీడీపీకి రాజీనామా చేశారు. ఇక చంద్రబాబుకు కూడా అఖిలప్రియ తీరు ఏ మాత్రం పడటం లేదని తెలుస్తోంది. ఆమెను వచ్చేసారి ఆళ్లగడ్డ నుంచి పోటీ చేయించకూడదని కూడా బాబు అనుకుంటున్నాడట.

ఆమెను నంద్యాల నుంచి ఎంపీగా పోటీ చేయించాలనేది బాబు లెక్క. టీడీపీకి ఏ మాత్రం అనుకూలంగా లేని ఆ సీట్లో ఆమెను పోటీ చేయిస్తే కచ్చితంగా ఓడిపోతుంది. అందుకే అఖిల టీడీపీని వీడటానికి రెడీ అవుతోందని సమాచారం. ఆమె చూపు జనసేన వైపు ఉందని టాక్!