Home రాజకీయాలు కాంగ్రెస్ కోరినన్ని సీట్లను బాబు ఇవ్వాల్సిందేనా!

కాంగ్రెస్ కోరినన్ని సీట్లను బాబు ఇవ్వాల్సిందేనా!

SHARE

ఏపీలో కాంగ్రెస్, టీడీపీల పొత్తు ఖరారు అయినట్టుగా తెలుస్తోంది. చంద్రబాబు నాయుడు ఢిల్లీ టూర్ నేపథ్యంలో పొత్తు ఒక కొలిక్కి వచ్చిందని సమాచారం. ఏపీలో కాంగ్రెస్ తో పొత్తు పెట్టుకోవాలా.. వద్దా అనే అంశం మీద ఇటీవల రాహుల్ గాంధీ తన పార్టీ ఏపీ లీడర్ల అభిప్రాయాలను తీసుకున్నాడు. చంద్రబాబు నాయుడు కాంగ్రెస్ కు సన్నిహితంగా మెలుగుతున్న నేపథ్యంలో… పొత్తు విషయంలో రాహుల్ తమ వారిని అడిగినట్టుగా తెలుస్తోంది.

తెలంగాణలో ఇరు పార్టీలూ పొత్తు పెట్టుకుని చిత్తు అయ్యాయి. అయితే ఇప్పుడు ఏపీలో పొత్తు కావాలని కాంగ్రెస్ నేతలు అంటున్నారు. ఏపీలో పోటీ చేసేందుకు ఉత్సాహంగా ఉన్న కాంగ్రెస్ నేతలంతా.. పొత్తుకు అనుకూలంగా అభిప్రాయాలు చెప్పినట్టుగా తెలుస్తోంది. పొత్తు పెట్టుకోవాలనే వారంతా కోరుతున్నారట. అంతే కాదు.. వీళ్లు సీట్ల జాబితాను కూడా అందజేసశారని సమాచారం.

తెలంగాణ ఎన్నికలకు ముందే ఏపీ ఎన్నికల విషయంలో కూడా ఒప్పందం కుదిరిందని.. దాని ప్రకారం.. చంద్రబాబు నాయుడు ఏపీలో కాంగ్రెస్ కు 25 ఎమ్మెల్యే సీట్లు.. ఐదారు ఎంపీ సీట్లు కేటాయించే అవకాశాలున్నాయని తెలుస్తోంది. ఢిల్లీ స్థాయిలో కాంగ్రెస్ పార్టీతో దోస్తీ కోసం బాబు ఉబలాపడుతున్నాడు. దీంతో ఏపీలో సీట్లు కేటాయించకతప్పని పరిస్థితి.

ఏపీలో కాంగ్రెస్, టీడీపీలు కలిసి పోటీ చేసినా సాధించేది ఏమీ లేదని.. ఇరు పార్టీలూ కలిసి ఆరు ఎంపీ సీట్లను నెగ్గితే ఎక్కువ అని ఇటీవలే ఒక సర్వే స్పష్టం చేసిన సంగతి తెలిసిందే.