Home రాజకీయాలు హడావుడి అంతా చంద్రబాబుదే, వాళ్లు తప్పుకున్నట్టే!

హడావుడి అంతా చంద్రబాబుదే, వాళ్లు తప్పుకున్నట్టే!

SHARE

కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో కూటమి అంటూ మళ్లీ ఢిల్లీలో తేలాడు చంద్రబాబు నాయుడు. కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాంధీని కలిసి రొటీన్ గా పూలబొకే, శాలువాతో సన్మానించేశాడు. ఇది ఢిల్లీకి వెళ్లినప్పుడల్లా చంద్రబాబుకు మామూలే. గతంలో బీజేపీ నేతలు సత్కారం. ఇప్పుడు కాంగ్రెస్ నేతల వంతు. ఇదే తేడా.

ఇక ఢిల్లీలోపలువురు ప్రముఖులను బాబు కలుస్తున్నాడట. శరద్ పవార్, శరద్ యాదవ్, అరవింద్ కేజ్రీవాల్, సీతారాం ఏచూరీ తదితరులు అనమాట.

ఒకవైపు కాంగ్రెస్ తో దోస్తీకి పలు పార్టీలు టాటా చెప్పేశాయి. ఎస్పీ, బీఎస్సీలు ఈ మధ్యనే కాంగ్రెస్ కు పూర్తిగా దూరం అయ్యాయి. తాము యూపీలో కలిసి పోటీ చేస్తున్నట్టుగా ఆ పార్టీలు ప్రకటించాయి. కాంగ్రెస్ ను మాత్రం కలుపుకునేది లేదని అనేశాయి. ఇలాంటి నేపథ్యంలో చంద్రబాబు ఢిల్లీ వెళ్లాడు.

అలాగే మమతా బెనర్జీ కూడా కాంగ్రెస్ తోపొత్తు ప్రసక్తి లేదని చెప్పింది. కూటమి కథ ఎన్నికల తర్వాత అన్నట్టుగా ఆ పార్టీలు వ్యవహరిస్తున్నాయి. అయితే చంద్రబాబు నాయుడు మాత్రం ఢిల్లీ వెళ్లి ఈ రకమైన హడావుడి చేస్తున్నాడు. ఇప్పుడు కాంగ్రెస్ తో అవసరం చంద్రబాబుకు తప్ప మరెవరికీ లేనట్టుంది!