Home రాజకీయాలు జగన్ పై హత్యాయత్నం.. బాబు సర్కార్ ఎందుకిలా?!

జగన్ పై హత్యాయత్నం.. బాబు సర్కార్ ఎందుకిలా?!

SHARE

వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత జగన్ మోహన్ రెడ్డిపై విశాఖ ఎయిర్ పోర్టులో జరిగిన హత్యాయత్నం విషయంలో చంద్రబాబు నాయుడు సర్కారు తన తీరును కొనసాగిస్తూ ఉంది. జగన్ పై హత్యాయత్నం జరిగిన దగ్గర నుంచి బాబు సర్కారు ఈ విషయంలో ఎలా వ్యవహరిస్తోందో వివరించనక్కర్లేదు. ఈ హత్యాయత్నం ముందస్తు కుట్ర అనే, ఇదంతా పచ్చప్లాన్ అనే ఆరోపణ మొదటి నుంచి వినిపిస్తున్న తరుణంలో.. చంద్రబాబు ప్రభుత్వం ఈ విషయంలో తొండివాదనలు చేస్తూ ఉంది.

మొదటేమో.. ఇది జగన్ మీద జగన్ చేయించుకున్న దాడి అంటూ మొదలుపెట్టి.. ఈ విషయంలో అనేక డొల్లవాదనలు వినిపిస్తూ వచ్చారు. ఆఖరికి జగన్ ఇంట్లో వాళ్లే ఈ పనిచేయించారు అనే నీఛమైన వ్యాఖ్యానం కూడా టీడీపీ వైపు నుంచి వినిపించింది.

ఇకక జగన్ మీద జరిగిన హత్యాయత్నం విషయంలో టీడీపీ నేతల వెకిలిమాటలు, వ్యంగ్య వ్యాఖ్యానాలు ఇంకా కొనసాగుతూ ఉన్నాయి. అదలా ఉంటే.. ఈ కేసుపై విచారణను ఎన్ఐఏకు అప్పగించింది హై కోర్టు. అయితే ఎన్ఐఏకు కూడా ఏపీ ప్రభుత్వం, ఏపీ పోలీసులు ఏ మాత్రం సహకరించడం లేదని ఇప్పుడు స్పష్టం అవుతోంది.

అందుకు ఎన్ఐఏ హై కోర్టులో తాజాగా దాఖలు చేసిన పిటిషనే సాక్ష్యం. జగన్ పై జరిగిన హత్యాయత్నం విషయంలో డాక్యుమెంట్స్ ను ఏపీ పోలీసులు తమకు అప్పగించలేదంటూ ఎన్ఐఏ అధికారులు పిటిషన్ వేశారు. వారి చేత ఆ డాక్యుమెంట్స్ ను అప్పగించేలా ఆదేశాలు ఇవ్వాలని వారు కోరారు. అలాగే ఈ కేసులో నిందితుడు శ్రీనివాసరావును తమకు అప్పగించాలని కూడా వారు కోరారు.

ఇక్కడ స్పష్టం అవుతున్న విషయం ఏమిటంటే.. ఎన్ఐఏకు కూడా ఏపీ ప్రభుత్వం ఏ మాత్రం సహకరించడం లేదు అని, బాబు ప్రభుత్వం ఎందుకు ఇలా వ్యవహరిస్తున్నట్టు? అనేది రోజు రోజుకూ పెద్ద సందేహంగా మారుతోంది.