Home రాజకీయాలు ఏపీ రాజకీయం..ఇక ఫిరాయింపులే ఫిరాయింపులా!

ఏపీ రాజకీయం..ఇక ఫిరాయింపులే ఫిరాయింపులా!

SHARE

జనవరి నెలాఖరు కల్లా అటు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ, ఇటు తెలుగుదేశం పార్టీలు అభ్యర్థుల విషయంలో ఒక అంచనాలను ఏర్పరిచే అవకాశం ఉంది. ఆ సమయానికి అధికారికంగా ఆ పార్టీలు అభ్యర్థులను ప్రకటించవచ్చు. అధికారికంగా ప్రకటించకపోయినా.. కనీసం సూచన ప్రాయంగా అయినా అభ్యర్థుల జాబితాపై ఒక అంచనా వస్తుంది.

ఎవరికి టికెట్లు దక్కుతాయో ఎవరికి టికెట్లు దక్కవో క్లారిటీ వస్తుంది. ఇంకేముంది.. ఫిరాయింపులు భారీగా ఉండబోతున్నాయని స్పష్టం అవుతోంది.

ప్రత్యేకించి ఈ సారి పోటీలో మూడు పార్టీలు. ఆ పార్టీలో టికెట్ దక్కకపోతే.. ఈ పార్టీలోకి, ఇక్కడ దక్కని వారు మరో పార్టీలోకి! ఇలానే ఉండబోతోంది రాజకీయం.

ప్రత్యేకించి.. అధికార టీడీపీ నుంచి బారీగా వలసలు ఉండబోతున్నాయి. భారీ స్థాయిలో సిట్టింగ్ ఎమ్మెల్యేలను మార్చేస్తానని చంద్రబాబు నాయుడు చెబుతూ ఉన్నాడు. అలాగే.. ఫిరాయింపుదారులు ఉండనే ఉన్నారు. ఇలాంటి వారి మధ్యన ఒకరికి టికెట్ ఇస్తే మరొకరు అసహనభరితులు కావడం ఖాయంగా కనిపిస్తోంది.

ఇలాంటి నేఫథ్యంలో.. జనవరి నెల గడిచిపోనుంది. ఈ నెలాఖరుకు రాజకీయం ఒక కొలిక్కిరావొచ్చు. అప్పటి నుంచి ఫిరాయింపులు భారీ స్థాయిలో ఉంటాయని స్పష్టం అవుతోంది.