Home ట్రైలర్స్ ‘యాత్ర’ ట్రైలర్: జనాలకేం కావాలో తెలుసు కోవాలని ఉంది.. వినాలని ఉంది!

‘యాత్ర’ ట్రైలర్: జనాలకేం కావాలో తెలుసు కోవాలని ఉంది.. వినాలని ఉంది!

SHARE

ఉమ్మడి తెలుగు రాష్ట్రముఖ్యమంత్రిగా తెలుగు రాజకీయాలపై చెరగని ముద్ర వేసిన వైఎస్సార్ రాజకీయ జీవితంలోని పాదయాత్ర  ఎపిసోడ్ ప్రధాన ఇతివృత్తంగా ‘యాత్ర’ తెరకెక్కుతోంది.  ఈ సినిమా ట్రైలర్ కాసేపటి క్రితం విడుదలైంది.  2 నిముషాల 4 సెకన్లు నిడివి గల ఈ ట్రైలర్లో దర్శకుడు మహీ వీ రాఘవ్ సినిమాలో ఏముంటుందో చెప్పేశాడు.

“నా విధేయత ను విశ్వాసాన్ని బలహీనతగా తీసుకోవద్దండి” అంటూ ఒక పదునైన డైలాగ్ వేస్తాడు.   మరో సందర్భంలో “నాయకుడిగా మనకేంకావాలో తెలుసుకున్నాం.. జనాలకేం కావాలో తెలుసుకోలేక పోయాం. తెలుసు కోవాలని ఉంది.. వినాలని ఉంది.. ఈ కడప దాటి ప్రతి గడపకూ వెళ్ళాలని ఉంది.” అంటూ పాదయాత్రకు వైఎస్సార్ మనస్సులో బీజం పడిన సందర్భాన్ని కళ్ళకు కట్టినట్టు చూపించారు.