Home రాజకీయాలు వైఎస్సార్సీపీలోకి మరో టీడీపీ నేత.. ఎంపీగా!

వైఎస్సార్సీపీలోకి మరో టీడీపీ నేత.. ఎంపీగా!

SHARE

ఒంగోలు మాజీ ఎంపీ మాగుంట శ్రీనివాసులు రెడ్డి వైస్సార్ కాంగ్రెస్ పార్టీలోకి చేరనున్నట్టుగా తెలుస్తోంది. అందుకు రంగం సిద్ధం అవుతోందని సమాచారం. మాగుంట టీడీపీని వీడే అవకాశాలున్నాయని ఇది వరకే వార్తలు వచ్చాయి. అయితే చంద్రబాబు నాయుడు ఆయనను నిలుపుకునేందుకు ప్రయత్నిస్తూ ఉన్నాడు. కానీ టీడీపీ తరపున ప్రకాశం జిల్లాలో పోటీ చేసి గెలిచే పరిస్థితి లేదని మాగుంటకు అర్థం అయిపోయింది.

ఈ నేపథ్యంలో ఆయన వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలోకి చేరడం ఖాయమైందని సమాచారం.ఒంగోలు ఎంపీ సీటు విషయంలో జగన్ నుంచి మాగుంటకు గ్రీన్ సిగ్నల్ లభించిందని.. ఈ మేరకు శ్రీనివాసుల రెడ్డి వైసీపీ తీర్థం పుచ్చుకోనున్నాడని తెలుస్తోంది.

మాగుంట కాంగ్రెస్ పార్టీ తరఫు నుంచి ఒంగోలు ఎంపీగా ఘన విజయాలే సాధించాడు. అయితే విభజన తర్వాత ఈయన తెలుగుదేశం పార్టీలోకి వెళ్లాడు. ఫలితంగా ఓటమిని మూటగట్టుకున్నాడు. ఇప్పుడు వైసీపీలోకి చేరి తన గత ప్రభంజనాన్ని మళ్లీ తెచ్చుకోవాలని ఈయన భావిస్తున్నట్టుగా ఉన్నాడు.