Home రాజకీయాలు పచ్చ మీడియా కూడా.. జగన్ చూపించాల్సిందే ఇక!

పచ్చ మీడియా కూడా.. జగన్ చూపించాల్సిందే ఇక!

SHARE

ఏపీలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ హవా తథ్యమని స్పష్టం అవుతోంది. జాతీయ మీడియా దగ్గర నుంచి యూట్యూబ్ చానళ్లు చేసే సర్వేల వరకూ .. ప్రతి దాంట్లోనూ వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ హవానే ఉంటుందని స్పష్టం అవుతోంది. గత పర్యాయం జగన్ కు త్రుటిలో తప్పిన విజయం..ఈ సారి సాకారం అవుతుందని స్పష్టం అవుతోంది.

ఇక ఎన్నికలకు మరెంతో సమయం లేదు. ఇలాంటి నేపథ్యంలో మీడియా వర్గాల్లో కూడా మార్పు అనివార్యం అయ్యింది. అందుకు నిదర్శనమే తెలుగుదేశం అనుకూల చానల్ ఒకటి జగన్ తో సుదీర్ఘ ఇంటర్వ్యూ చేయడం.

ముందుగా జగన్ సొంత మీడియా కు ఇంటర్వ్యూ ఇచ్చాడు. దేవులపల్లి అమర్ సాక్షి తరఫున వెళ్లి ఇంటర్వ్యూ చేశాడు. ఇక ఆ వెంటనే ఒక పచ్చ చానల్ రంగంలోకి దిగింది. జగన్ ను ఏదో విధంగా ఇరికించాలనే టీడీపీ అనుకూల చానళ్లు ఇలాంటి ఇంటర్వ్యూలు కూడా చేస్తూ ఉంటాయి. అందులో భాగంగా.. ప్రయత్నించినా, జగన్ మాత్రం ఎక్కడా దొరకలేదు.తన చక్కటి మాట తీరుతో.. జగన్ ఈ ఇంటర్వ్యూలో సూటిగా స్పష్టంగా మాట్లాడాడు. తన విధానాలను స్పష్టం చేశాడు.

ఇక మిగతా పచ్చ చానళ్లు కూడా జగన్ ఇంటర్వ్యూల కోసం వేచి చూసే సయమం వచ్చినట్టుగా ఉంది. లేకపోతే.. జనాలే వాటిని పక్కన పెట్టే అవకాశాలున్నాయి!