Home ప్రత్యేకం ఏపీలో వైఎస్సార్సీపీ ప్రభంజనం..జాతీయ మీడియ సర్వే!

ఏపీలో వైఎస్సార్సీపీ ప్రభంజనం..జాతీయ మీడియ సర్వే!

SHARE

ఇండియా టీవీ సర్వే అత్యంత ఆసక్తిదాయకంగా ఉంది. ఏపీలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ప్రభంజనం ఉంటుందని ఈ సర్వే అంచనా వేసింది. డిసెంబర్ పదిహేనో తేదీ నుంచి డిసెంబర్ ఇరవై ఐదో తేదీ మధ్యన తాము సర్వే చేసినట్టుగా ఆ సంస్థ ప్రకటించింది. దాని ప్రకారం.. ఏపీలో పాతిక ఎంపీ సీట్లకు గానూ 19 ఎంపీ సీట్లు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నెగ్గే అవకాశం ఉందని ఈ సర్వే అంచనా వేసింది.

తెలుగుదేశం, కాంగ్రెస్ పార్టీలు కలిసి పోటీ చేయడం, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఒంటరిగా పోటీ చేయడం అనే సమీకరణాల ఆధారంగా ఈ సర్వేను చేసినట్టుగా ఇండియాటీవీ పేర్కొంది.

కాంగ్రెస్, టీడీపీలు కలిసి పోటీ చేసినా.. సాధించేంది కేవలం ఆరు ఎంపీ సీట్లే అని ఈ అధ్యయనం పేర్కొనడం విశేషం. అందులో నాలుగు ఎంపీ సీట్లను తెలుగుదేశం పార్టీ నెగ్గే అవకాశం ఉందని, రెండు ఎంపీ సీట్లుకాంగ్రెస్ పార్టీ దక్కించుకోవచ్చని ఈ అధ్యయనం అంచనా వేసింది.

ఆ రెండు పార్టీలూ కలిసినా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభంజనం ఆగదని ఈ నేషనల్ మీడియా సర్వే అబిప్రాయపడింది. కలిసి పోటీ చేస్తేనే.. కాంగ్రెస్, టీడీపీలు సాధించేది ఆరు సీట్లు అయితే, వేర్వేరుగా పోటీ చేస్తే ఆ పార్టీల పరిస్థితి ఏమిటో. స్థూలంగా దాదాపు నూటా నలభై ఎమ్మెల్యే సీట్లలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి సానుకూలత ఉందని ఈ సర్వే చెబుతోంది!