Home రాజకీయాలు బీజేపీకి ఎమ్మెల్యేల రాజీనామా షాకులు!

బీజేపీకి ఎమ్మెల్యేల రాజీనామా షాకులు!

SHARE

ఏపీ బీజేపీకి ఆ పార్టీ ఎమ్మెల్యేలు రాజీనామాల షాకులు ఇస్తున్నారు. వచ్చే ఎన్నికల్లో బీజేపీతో ఏపీలో ఏ పార్టీ కూడా పొత్తుకు సిద్ధంగా లేదు. ఇలాంటి నేపథ్యంలో కమలం పార్టీలో నేతలు మిగిలే అవకాశం కనిపించడం లేదు. ప్రత్యేకహోదా విషయంలో బీజేపీ వ్యవహరించిన తీరుతో ఆ పార్టీకి తీరని నష్టం జరిగే అవకాశం ఉంది ఏపీలో.

ఇలాంటి నేపథ్యంలో ఎమ్మెల్యేలు కూడా తమ దారి తాము చూసుకుంటున్నట్టుగా ఉన్నారు. వీరిలో తాజాగా రాజీనామా విషయాన్నిప్రకించాడు రాజమండ్రి ఎమ్మెల్యే ఆకుల సత్యనారాయణ. ఈయన జనసేన పార్టీలోకి చేరనున్నాడని చాన్నాళ్ల నుంచినే వార్తలు వస్తున్నాయి. ఇప్పుడు అవే నిజం అవుతున్నాయి.

ఈయన భార్య ఇప్పటికే జనసేన లో చేరిపోయారు. ఇప్పుడు సత్యనారాయణ వంతు వచ్చింది. ఈయన జనసేన తరఫు నుంచి రాజమండ్రి ఎంపీగా పోటీ చేయవచ్చని వార్తలు వస్తున్నాయి. ఈయన భార్యకు కూడా టికెట్ దక్కవచ్చునేమో.

ఇక మరో ఎమ్మెల్యే విష్ణుకుమార్ రాజు కూడా రాజీనామా ఖాయమనే అని చెప్పాలి. ఆయన తెలుగుదేశం పార్టీలోకి చేరనున్నాడని స్పష్టం అవుతోంది. వైసీపీలో టికెట్ దక్కుతుందేమో అని ఆయన అనుకున్నాడు. అయితే అక్కడ ఛాన్స్ లేకపోవడంతో.. తెలుగుదేశం వైపు చూస్తున్నట్టుగా సమాచరాం. మాజీ మంత్రి కామినేని ఇప్పటికే బీజేపీకి రాజీనామా చేయాలని అనుకున్నాడు. అయితే వెంకయ్య నాయుడు వద్దని వారించడంతో ఆయన కామ్ అయిపోయినట్టుగా సమాచారం.