Home రాజకీయాలు కాంగ్రెస్ పార్టీకి.. మిత్రపక్షాల ఝలక్.. !

కాంగ్రెస్ పార్టీకి.. మిత్రపక్షాల ఝలక్.. !

SHARE

యూపీలో కాంగ్రెస్ పార్టీకి ఎస్పీ, బీఎస్పీలు గట్టి ఝలక్ ఇచ్చాయి. మొత్తం ఎనభై ఎంపీ సీట్లున్న యూపీలో ఆ రెండు పార్టీలూ సీట్ల డీల్ కుదుర్చుకున్నాయి. చెరో ముప్పై ఏడు ఎంపీ సీట్లు పంచుకుంటాయని తెలుస్తోంది.ఈ రాష్ట్రంపై కాంగ్రెస్ పార్టీకి చాలా ఆశలే ఉన్నాయి. అయితే కాంగ్రెస్ ను ఎస్పీ, బీఎస్పీలు అస్సలు పట్టించుకోవడం లేదు.

కొన్నాళ్ల కిందట జరిగిన యూపీ అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీతో కలిసే పోటీ చేసింది సమాజ్ వాదీ పార్టీ. అప్పుడు బీఎస్పీ విడిగా పోటీ చేసింది. అయితే.. కాంగ్రెస్ తో కలిసి పోటీ చేసినా..ఎస్పీకి దక్కింది ఏమీ లేదు. రెండు పార్టీలూ కలిసి చిత్తు అయిపోయాయి.

ఇక సోలోగా పోటీ చేసిన బీఎస్పీ కూడా అసెంబ్లీ ఎన్నికల్లో సాధించింది ఏమీ లేదు. ఈ నేపథ్యంలో ఈ సారి స్ట్రాటజీ మార్చాయి ఆ పార్టీలు. ఆ రెండు కలిసి పోటీ చేస్తూ.. కాంగ్రెస్ పార్టీని ఒంటరిని చేశాయి. కాంగ్రెస్ పార్టీకి ముందుగా రెండు ఎంపీ సీట్లు కేటాయిస్తామని ఆ రెండు పార్టీలూ ప్రకటించాయి.
ఒకటి సోనియాకు మరోటి రాహుల్ కు.అంతే.. రాష్ట్రంలో కాంగ్రెస్ ఎక్కడా పోటీ చేయడానికి లేదు! అది ఎస్పీ- బీఎస్పీల ప్రతిపాదన. అయితే దానికి కాంగ్రెస్ ససేమేరా అని స్పష్టం చేసింది.

దీంతో ఆ రెండు సీట్లలో కూడా తామే పోటీ చేస్తామని.. ఎస్పీ, బీఎస్పీలు అంటున్నాయి. కాంగ్రెస్ తో పొత్తు తమకు అవసరం లేదని తేల్చేశాయి. బీజేపీకి వ్యతిరేకంగా అన్నిపార్టీలనూ కలపాలని కాంగ్రెస్ అనుకుంటుంటే.. కాంగ్రెస్ ను పక్కన పెట్టేసి.. బీజేపీకి వ్యతిరేకంగా ఎస్సీ, బీఎస్పీలు పోటీ చేస్తుండటం విశేషం!