Home రాజకీయాలు సర్వేలు.. బాబుకు సానుకూల స్థితి లేదంటున్నాయి!

సర్వేలు.. బాబుకు సానుకూల స్థితి లేదంటున్నాయి!

SHARE

జాతీయ రాజకీయాల మీద.. కేంద్రంలో మళ్లీ ప్రభుత్వం ఎవరిది అనే అంశం మీద సాగుతున్న వివిధ సర్వేలు మళ్లీ మోడీకే పట్టం అని అంటున్నాయి. ఒకవైపు మోడీపై పోరాటం.. మోడీని దించేస్తాను.. అని రోజూ చెబుతున్నాడు చంద్రబాబు నాయుడు. ఈ రోజు అని కాదు.. ప్రతిరోజూ చంద్రబాబు నాయుడు ది అదే పాటే. మొన్నటి వరకూ మోడీ భజన చేశాడు చంద్రబాబు నాయుడు.

మోడీనే మళ్లీ ప్రధాని కావాలని తీర్మానం కూడా పెట్టాడు. మోడీ వీరుడు, శూరుడు అని పొగిడాడు. మోడీ ఏపీకి బ్రహ్మాండమైన సాయం చేశాడని అంటూ.. అసెంబ్లీలో ధన్యవాద తీర్మానం కూడా చేశాడు. అయితే బాబు ఇప్పుడు మోడీని విలన్ అంటున్నాడు.

నాలుగున్నరేళ్లు అధికారం పంచుకుని.. ఇప్పుడు మాత్రం మోడీ ద్రోహం చేశాడని బాబు చెబుతున్నాడు. కాంగ్రెస్ ను నెత్తికి ఎత్తుకుంటున్నాడు. అయితే చంద్రబాబు నాయుడుకు జాతీయ స్థాయి సర్వేలు ఝలక్ ఇస్తున్నాయి. మళ్లీ వచ్చేది మోడీనే అని చెబుతున్నాయి.

ఉత్తరాది బెల్ట్ లో.. హిందీ మాట్లాడే ప్రాంతాల్లో మోడీ హవా ఏ మాత్రం తగ్గలేదని.. ఇటీవల మూడు రాష్ట్రాల్లో బీజేపీ ఓడిపోయినా.. అవే రాష్ట్రాల్లో లోక్ సభ ఎన్నికల్లో బీజేపీ మళ్లీ సత్తా చూపిస్తుందని సర్వేలు అంచనా వేస్తున్నాయి. మళ్లీ మోడీనే వస్తాడంటున్న సర్వేలు.. చంద్రబాబును నిరుత్సాహపరుస్తూ ఉండవచ్చు.