Home రాజకీయాలు జగన్ పై అటాక్.. ఎన్ఐఏ విచారణ.. లోకేష్ లో భయం మొదలైందా?

జగన్ పై అటాక్.. ఎన్ఐఏ విచారణ.. లోకేష్ లో భయం మొదలైందా?

SHARE

వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత జగన్ మోహన్ రెడ్డి మీద జరిగిన హత్యాయత్నం కేసు విచారణను కేంద్ర దర్యాప్తు సంస్థ ఎన్ఐఏకు అప్పగించడంపై తెలుగుదేశం పార్టీలో ఆందోళన వ్యక్తం అవుతున్నట్టుగా తెలుస్తోంది. హై కోర్టు ఆదేశాల మేరకు ఈ కేసు విచారణను ఎన్ఐఏకు అప్పగించారు. అయితే.. తెలుగుదేశం పార్టీ మాత్రం ఇది కూడా మోడీ కుట్ర అని అంటోంది.

వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ, బీజేపీలు కలిసి కుట్ర పన్ని ఈ కేసును ఎన్ఐఏ వద్దకు తీసుకెళ్లారు అన్నట్టుగా తెలుగుదేశం పార్టీ మాట్లాడుతోంది.ఈ కేసు విచారణను ఎన్ఐఏ స్వీకరించలేదు. కేవలం కోర్టు ఆదేశాల మేరకే విచారణ మొదలైంది. ఇలాంటి నేపథ్యంలో కూడా తెలుగుదేశం పార్టీ ఇదంతా మోడీ కుట్ర అన్నట్టుగా మాట్లాడుతుండటం విశేషం.

జగన్ పై హత్యాయత్నం విషయంలో తెలుగుదేశం పార్టీ పాత్ర ఉందని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అంటోంది. లోకేష్ ఆధ్వర్యంలో ఈ కుట్ర జరిగిందని, ఢిల్లీలో ఉన్న టీడీపీ అధినేత చంద్రబాబు మనిషి ఒకరు ఈ వ్యవహారంలో కీలక పాత్ర పోషించాడని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అంటోంది.

దీనిపై ఎన్ఐఏ విచారణతో మొత్తం కుట్ర బయటకు వచ్చే అవకాశం ఉందని వైసీపీ నేతలు అంటున్నారు. ఎన్ఐఏ విచారణ మొదలు కాగానే.. లోకేష్ లో భయాందోళన మొదలైందని, అందుకే ఎన్ఐఏ విచారణ మీద కూడా ట్వీట్లు చేశాడని వైకాపా నేతలు అంటున్నారు.

ఎన్ఐఏ కు ఏపీ పోలీసులు విచారణకు కూడా సహకరించడం లేదన మాట కూడా వినిపిస్తోంది. ఈ విధంగా ఏపీ పోలీసులు చంద్రబాబు తొత్తులుగా వ్యవహరిస్తున్నారనే అభిప్రాయాలు వినిపిస్తున్నాయి.