Home రాజకీయాలు తేలని జమ్మలమడుగు పంచాయితీ..తగ్గమంటున్నారు!

తేలని జమ్మలమడుగు పంచాయితీ..తగ్గమంటున్నారు!

SHARE

ఒకరేమో ఫిరాయింపుదారుడు.. మరొకరేమో దశాబ్దాలుగా తెలుగుదేశం పార్టీనే పట్టుకుని వేలాడుతున్న వ్యక్తి. ఒకరేమో వేరే పార్టీ తరఫున గెలిచిన వ్యక్తి.. మరొకరు సొంత పార్టీ తరఫున ఓడిన వ్యక్తి.. వీళ్లిద్దరి మధ్యనా చాన్నాళ్లుగా రచ్చ ఉంది. అయితే ఇన్ని రోజులూ ఒకరికి మంత్రి పదవి, మరొకరికి ఎమ్మెల్సీ పదవిని ఇచ్చి చంద్రబాబు నాయుడు సర్ధి చెప్పాడు.

అయితే ఇప్పుడు మళ్లీ ఎన్నికలు వస్తున్నాయి,. ఈ ఇద్దరు నేతలూ టికెట్ విషయంలో పోటీ పడుతున్నారు. ఇలాంటి పరిణామాల మధ్యన ఆదినారాయణ రెడ్డి, రామసుబ్బారెడ్డిల్లో ఎవరికి టికెట్ కేటాయించాలనే అంశం మీద చంద్రబాబు నాయుడు కసతర్తు ఒక కొలిక్కి రావడం లేదని తెలుస్తోంది. ఈ విషయంలో చంద్రబాబు నాయుడు తాజాగా మళ్లీ చర్చలు ప్రారంభించాడు.

ఎమ్మెల్యే టికెట్ ఒకరికి వచ్చి.. కడప ఎంపీ టికెట్ ను మరొకరికి ఇవ్వాలనేది చంద్రబాబు నాయుడి ప్లాన్. అయితే.. దానికి వారిద్దరూ ఒప్పుకోవడం లేదు. ఎవరికి వారు.. తమకు ఎమ్మెల్యే టికెట్ కావాలనే అంటున్నారని సమాచారం. మూడేళ్ల కిందట ఆదినారాయణ రెడ్డి ఫిరాయించినప్పుడు ఎలాంటి రచ్చ మొదలైందో.. ఇప్పుడు ఎన్నికలు దగ్గర పడిన తరుణంలో కూడా అదే రచ్చే కొనసాగుతూ ఉందని సమాచారం.

ఎమ్మెల్యే టికెట్ విషయంలో ఈ ఇద్దరు నేతలూ తగ్గమని అంటున్నారు. మరి బాబు వీరిలో ఎవరికి టికెట్ ఇస్తాడో, ఎవరిని సముదాయిస్తాడో చూడాలి!