Home రాజకీయాలు టీడీపీ బలహీనత బయటపడిపోయింది..నేతల్లో కలవరం!

టీడీపీ బలహీనత బయటపడిపోయింది..నేతల్లో కలవరం!

SHARE

పొత్తులు లేకుండా పోటీ చేయలేకపోవడం.. అనేది తెలుగుదేశం పార్టీకి ఉన్న పెద్ద బలహీనత. చంద్రబాబు నాయడు చరిత్రలో ఎన్నడూ పొత్తులు లేకుండా పోటీ చేసింది లేదు. ఎన్నికలు వచ్చాయంటే ఏదో ఒక పార్టీతో పొత్తులు పెట్టుకోవడం చంద్రబాబుకు తప్పనిసరి. గతంలో తను ఎవరినైతే బాగా తిట్టి ఉంటాడో..అలాంటి వాళ్లతోనే బాబు పొత్తులు పెట్టుకుంటూ ఉంటాడు.

ఇలాంటి నేపథ్యంలో వచ్చేసారికి పవన్ కల్యాన్ దువ్వుతున్నాడు చంద్రబాబు. వరసగా రెండు రోజుల పాటు పవన్ ను పొత్తుకు పిలుపునిచ్చాడు. అయితే తను రాను అని పవన్ ప్రకటించాడు. ఇప్పటి వరకూ చాలా జరిగింది. ఇలాంటి నేపథ్యంలో పవన్ కల్యాణ్ మళ్లీ తెలుగుదేశంతో పొత్తుపెట్టుకుంటే..అతడు తీవ్రంగా విమర్శల పాలవుతాడు.

దీంతో అతడు పొత్తుకు నో అని గట్టిగా చెప్పినట్టుగా ఉన్నాడు. బహిరంగంగానే చంద్రబాబు నాయుడు పొత్తుకు పిలుపునిస్తే, పవన్ కూడా బహిరంగంగానే నో చెప్పాడు. మరి ఇప్పుడు చంద్రబాబు నాయుడు తన పార్టీని మరింత ఇరకాటంలో పడేసినట్టుగా అయ్యింది. పొత్తుల్లేకుంటే పోటీచేయడం కుదరదు.. ఇదీ చంద్రబాబు చరిత్ర.

ఇప్పుడు సరైన దోస్తులు లేరు. పవన్ కల్యాణ్ ను నమ్ముకుంటే..అతడు కూడా నో అని అంటున్నాడు. దీంతో తెలుగుదేశం పార్టీలో కొత్త కలవరం మొదలైంది!