Home రాజకీయాలు ఎన్టీఆర్ బయోపిక్ పై.. నాగబాబు భారీ సెటైర్!

ఎన్టీఆర్ బయోపిక్ పై.. నాగబాబు భారీ సెటైర్!

SHARE

బాలయ్యను లక్ష్యంగా చేసుకుని నాగబాబు సెటైర్ల పరంపర కొనసాగుతూ ఉంది. ఇప్పటి వరకూ బాలయ్యను రకరకాలుగా దెప్పి పొడిచ్చాడు నాగబాబు. బాలయ్య ఎవరో తనకు తెలీదని అనడం, బాలయ్య అంటే.. పాత తరం కమేడియన్ అంటూ మరో సెటైర్ వేయడం, ఆ తర్వాత బాలయ్య చేసిన బ్లడ్డూ, బ్రీడు కామెంట్లకు దున్నపోతుతో కౌంటర్ ఇవ్వడం.. గట్రా చేశాడు నాగబాబు.

అది చాలదన్నట్టుగా ఇప్పుడు.. బయోపిక్ విషయంలో కూడా ఘాటైన వ్యాఖ్యలు చేశాడు నాగబాబు. ఎన్టీఆర్ బయోపిక్ విడుదలకు రంగం సిద్ధం అవుతున్న నేపథ్యంలో నాగబాబు పెట్టిన ఒక ఫేస్ బుక్ పోస్ట్ భారీ సెటైర్ లా ఉంది.

‘’కట్టుకథలు కొన్ని, కల్పనలు కొన్ని,చుట్టనేల,మూట కట్టనేల, నిజం కక్కలేని బయోపిక్ లు వద్దయా..విశ్వదాభిరామ, వినరామామా..’’అంటూ నాగబాబు ఒక ఫేస్ బుక్ పోస్ట్ పెట్టాడు. ఇందులో ఎక్కడా ఎన్టీఆర్ బయోపిక్ ప్రస్తావన లేకపోయినా.. ఇది ఎన్టీఆర్ బయోపిక్ మీద సెటైర్ అని స్పష్టం అవుతోంది.

ఆ సినిమా విడుదలకు మరో నాలుగైదు రోజుల సమయం ఉన్న నేపథ్యంలో ఇలాంటి పోస్టుతో నాగబాబు బాలయ్యపై బలమైన సెటైర్ వేశాడు. బయోపిక్ లో వాస్తవాలుఉండవని, కేవలం భజన మాత్రమే ఉంటుందని.. నిజాలు కక్కలేని బయోపిక్ లు ఎందుకని నాగబాబు గట్టిగా ప్రశ్నించాడు. ఈ విధంగా నాగబాబు సెటైర్ల పరంపర కొనసాగుతున్నట్టుంది!