Home రాజకీయాలు పవన్ రాజకీయంపై సన్నిహితుల్లోనే నమ్మకం లేదా?!

పవన్ రాజకీయంపై సన్నిహితుల్లోనే నమ్మకం లేదా?!

SHARE

చిరంజీవి రాజకీయ పార్టీ పెట్టినప్పుడు అనేక మంది రాజకీయ నేతలు ఆ పార్టీలో చేరారు. తెలుగుదేశం నుంచి, నాటి కాంగ్రెస్ పార్టీనుంచి అనేక మంది ప్రజారాజ్యంలోకి చేరారు. వారు మాత్రమే కాదు.. చిరంజీవి సన్నిహితులుగా కూడా కొంతమంది రాజకీయంలోకి వచ్చారు. చిరంజీవి ఇంట్లో వాళ్లతో సహా అనేక మంది సన్నిహితులు రంగంలోకి దిగారు.

అయితే పవన్ కల్యాణ్ తరఫు నుంచి మాత్రం ఆయన ఇంట్లో వాళ్లు కూడా రాజకీయం వైపు రావడం లేదు. పవన్ పార్టీలో ఆయన సోదరుడు నాగబాబు అయినా వస్తాడని అనుకుంటే.. వేరే పనులున్నాయని చెబుతున్నాడు. ఇక చిరంజీవి సంగతి సరేసరి. కాంగ్రెస్ లో ఉన్నా లేనట్టుగా వ్యవహరిస్తున్న చిరు జనసేన వైపు మాత్రం చూడటం లేదు.

ఇదీ పరిస్థితి. పవన్ కల్యాణ్ పార్టీలోకి ఆయన ఇంట్లోని వారు కూడా రావడం లేదని స్పష్టం అవుతోంది. అదలా ఉంటే.. ఇప్పుడు పవన్ కు అత్యంత సన్నిహితుడిగా పేరున్న నటుడు అలీ కూడా వైసీపీ తీర్థం పుచ్చుకోవడానికి రెడీ అవుతున్నాడు.

చిత్ర పరిశ్రమలో.. పవన్ కల్యాణ్, అలీల మధ్యన బంధం ఏమిటో చెప్పనక్కర్లేదు. ఇలాంటి నేపథ్యంలో.. పవన్ పార్టీలోకి కాకుండా.. వైఎస్ జగన్ పార్టీలోకి అలీ చేరుతుండటం విశేషం. పవన్ రాజకీయంపై ఆయన సన్నిహితుల్లోనే నమ్మకం లేదని ఈ విషయంతో స్పష్టం అవుతోంది.