Home రాజకీయాలు కుప్పంలోనూ టీడీపీకి ఎదురుగాలి..లోకేష్ కు భయం!

కుప్పంలోనూ టీడీపీకి ఎదురుగాలి..లోకేష్ కు భయం!

SHARE

తను ప్రాతినిధ్యం వహిస్తున్న కుప్పం నియోజకవర్గంలో సరిగా అభివృద్ధి జరగలేదని అంటున్నాడు చంద్రబాబు నాయుడు. ప్రజలకు సంక్షేమ పథకాలు సరిగా అందడం లేదని బాబు వ్యాఖ్యానించాడు. తను ఎమ్మెల్యేగా ఉన్న నియోజకవర్గంలోజన్మభూమి కార్యక్రమానికి వెళ్లిన చంద్రబాబు నాయుడు ఈ వ్యాఖ్యలు చేశాడు.

తను నియోజకవర్గం మీద దృష్టి పెట్టలేకపోయానని అందుకే ప్రజలకు అందాల్సిన ఫలాలు అందలేదని చంద్రబాబు నాయుడు చెప్పుకొచ్చాడు. ఒకవైపు చంద్రబాబు నాయడు తన పాలన అద్భుతం అంటాడు. ఎనభై శాతం ప్రజలు తన పాలన మీద చాలా సంతృప్తిగా ఉన్నారని చెప్పుకొంటూ ఉంటాడు.
అయితే ఇప్పుడు సొంత నియోజకవర్గంలో.. తను ప్రాతినిధ్యం వహిస్తున్న చోట మాత్రం ప్రజలకు ఫలాలు అందలేదని చంద్రబాబు నాయుడు వ్యాఖ్యానిస్తున్నాడు. సొంత నియోజకవర్గం విషయంలో బాబు ఇలా ఆందోళన చెందుతూ ఉన్నాడు.

వచ్చే ఎన్నికల్లో చంద్రబాబు నాయుడు కుప్పం నుంచి పోటీ చేసే అవకాశాలు కనిపించడం లేదు. ఈ సీటును తనయుడు లోకేష్ కు అప్పగించి మరో సీటును చూసుకునే ప్రయత్నంలో ఉన్నాడట చంద్రబాబు. తనయుడిని ఏదైనా కొత్త నియోజకవర్గంలో బరిలోకి దింపి సత్తా చూపించుకోమని చెప్పకుండా.. తను కొత్త నియోజకవర్గాన్ని వెదుక్కొంటూ.. కుప్పాన్ని లోకేష్ కు ఇవ్వనున్నాడట చంద్రబాబు. మరి అక్కడ ప్రజలకు కనీస పథకాలు కూడా అందుకపోతే.. లోకేష్ పరిస్థితి ఏమిటో!