Home రాజకీయాలు చంద్రబాబుకు దారుణ అవమానం…!

చంద్రబాబుకు దారుణ అవమానం…!

SHARE

తెలుగుదేశం పార్టీతో పొత్తు ఉండదు.. అని పవన్ కల్యాణ్ ప్రకటించడం చంద్రబాబుకు అవమానం అని చెప్పకతప్పదు. చంద్రబాబు నాయుడు ఎన్నికలను ఎదుర్కొనాలంటే పొత్తులు తప్పవు అనే భావనలోనే ఎప్పుడూ ఉంటాడు. బాబు చరిత్ర అంతా అంతే. ఏదో ఒక పార్టీతో పొత్తు లేనిది చంద్రబాబు నాయుడు ఎన్నికలకు వెళ్లే ప్రసక్తే ఉండదు. ఇలాంటి నేపథ్యంలో వచ్చే ఎన్నికలకు పవన్ కల్యాణ్ ను గోకాలని బాబు ప్రయత్నించాడు.

సొంతంగా గెలవలేమని ఒక అంచనాకు వచ్చేసిన చంద్రబాబు నాయుడు పవన్ కల్యాణ్ ను గోకుతున్నాడు. ఒకసారి కాదు.. జనసేనతో పొత్తును వరసగా రెండు రోజులు ప్రస్తావించాడు. తొలిసారేమో పొత్తు పెట్టుకుంటే తప్పేంటని ప్రశ్నించి, రెండో రోజు.. పొత్తుకు జనసేన రావాలని బాబు పిలుపునిచ్చాడు.

ఇదీ కథ. ఇలా పొత్తు పై తన ఆశలను బహిరంగ పరుచుకున్నాడు చంద్రబాబు నాయుడు. అయితే పొత్తుకు సిద్ధంగా లేమని పవన్ కల్యాణ్ ప్రకటించాడు. అయితే పవన్ ఈ మాట మీదే నిలబడతాడా లేక మాట మారుస్తాడా అనేది ఇంకా ముందుముందు తేలే అంశం.
అయితే ప్రస్తుతానికి చంద్రబాబు నాయుడు బద్నాం అయ్యాడు. తను పొత్తుకు రమ్మంటే పవన్ కల్యాణ్ నో అని చెప్పడం కచ్చితంగా బాబుకు అవమానమే. ఇందులో సందేహం ఏమీ లేదు.

తమ పార్టీ అన్ని స్థానాల్లోనూ పోటీ చేస్తుందని పవన్ కల్యాణ్ అంటున్నాడు. కమ్యూనిస్టు పార్టీలతో మాత్రం పొత్తు ఉంటుందని వ్యాఖ్యానించాడు. మరి పవన్ ఆ మాట మీదే నిలబడతాడా లేక.. మాట మారుస్తాడా.. అనే సంగతులు ముందు ముందు తెలిసే అవకాశం ఉంది.