Home రాజకీయాలు టీడీపీ గెలుపుపై చంద్రబాబుకే ఆశలు లేవా!

టీడీపీ గెలుపుపై చంద్రబాబుకే ఆశలు లేవా!

SHARE

వచ్చే ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ గెలుపు మీద ఆ పార్టీ వర్గాల్లోనే క్రమక్రమంగా ఆశలు సన్నగిల్లుతూ ఉన్నట్టున్నాయి. స్వయంగా చంద్రబాబు నాయుడు మాట్లాడుతున్న మాటలే దీనికి నిదర్శనంగా మారుతున్నాయి. చంద్రబాబు నాయడు ఇప్పుడు పొత్తుల కోసం వెంపర్లాడుతున్నాడు. పొత్తులు లేనిది చంద్రబాబు నాయుడు ఏనాడూ ఎన్నికల్లో నెగ్గింది లేదు.

ఈ నేపథ్యంలో ఇప్పుడు పొత్తుల కోసంబాబు విశ్వప్రయత్నాలు చేస్తున్నాడు. అయితే ఇప్పటికే చంద్రబాబు నాయుడుకు కాంగ్రెస్ పార్టీ కలిసి వచ్చింది. కాంగ్రెస్ వాళ్లు బాబుతో పొత్తుకు సై అని అంటున్నారు. అయితే కాంగ్రెస్ తో పొత్తు వల్లప్రయోజనం ఏమీ ఉండదు అనేది అందరికీ తెలిసిన సంగతే.
కాంగ్రెస్ పార్టీ ఏపీలో జీరో. గత ఎన్నికలతోనే అది స్పష్టం అయ్యింది. ఆ తర్వాత కాంగ్రెస్ పుంజుకుంది అనేది కూడా అబద్ధమే. ఇలాంటినేపథ్యంలో కాంగ్రెస్ తో పొత్తు పెట్టుకుని బరిలోకి దిగినా..చంద్రబాబు నాయుడుకుదక్కే ప్రయోజనాలు ఏమీ ఉండవు.

అయినా కాంగ్రెస్ కు ఎన్నో కొన్ని సీట్లు ఇచ్చి బాబు పొత్తు పెట్టుకుంటాడు.అయినా బాబు ప్రశాంతంగాలేడు. పవన్ కల్యాణ్ దేబిరిస్తున్నాడు. పొత్తుకు రమ్మని పిలుస్తున్నాడు. పవనేమో రానని అన్నాడు. ఒకవేళ అతడు అదే మాట మీద నిలబడితే..చంద్రబాబు నాయుడుకు పొత్తుకు మిత్రులు ఎవరూ లేనట్టే. కాంగ్రెస్ తో కలిసినా ప్రయోజనం లేదు కాబట్టి.. ఏనాడూ సొంతంగా పోటీ చేసి గెలిచిన చరిత్ర లేని..చంద్రబాబు చిత్తయిపోవడం ఖాయమేమో!