Home రాజకీయాలు ఎన్టీఆర్ బ‌యోపిక్ సినిమాలో నిజాలే చూపుతారా ?

ఎన్టీఆర్ బ‌యోపిక్ సినిమాలో నిజాలే చూపుతారా ?

SHARE

ఎన్టీ రామారావు గారి జీవితం ఆధారంగా బాలక్రిష్ణ ప్రధాన పాత్రలో రూపొందిన చిత్రం ‘ఎన్టీఆర్’. సినిమాను రెండు భాగాలుగా రిలీజ్ చేయనున్నారు.  వాటిలో మొదటి భాగం ‘కథానాయకుడు’పై ప్రేక్షకుల్లో ఎలాంటి సందేహాలు లేవుకానీ రెండవ భాగం ‘మహానాయకుడు’పైనే కొన్ని సందేహాలు తలెత్తుతున్నాయి. ఎందుకంటే అందులోనే ఎన్టీఆర్ రాజకీయ ప్రస్థానాన్ని, అందులోని ముఖ్య వ్యక్తులను చూపడం జరుగుతుంది.

ఎన్టీఆర్ బ‌యోపిక్ సినిమా విడుద‌ల ద‌గ్గ‌ర‌ప‌డుతున్న కొద్దీ వివాదాలు కూడా ముదురుతున్నాయి. ఎన్టీఆర్ బ‌యోపిక్ లో ప్ర‌ముఖ రాజ‌కీయ నాయ‌కుల పాత్రల‌ను ఎలా తీర్చి దిద్దుతున్న‌ర‌నే అంశం పై ఉత్కంఠ నెల‌కొంది. ఎన్టీఆర్ నిజ జీవితంలో జ‌రిగిన సంఘ‌ట‌న‌ల‌ను సినిమాలో య‌ధావిధిగా చిత్రీక‌రించాల‌ని కొంద‌రు కోరుతుంటే ప‌ట్టుబ‌డుతుంటే., అసలు య‌దార్థంగా ఎన్టీఆర్ కి ద్రోహం చేసిన వారిని హీరోలుగా చూపించే ప్ర‌మాదం ఉంద‌ని మ‌రికొంత మంది అంటున్నారు.

అందుకే నిజంగా జరిగాయని ఏళ్ల తరబడి చెప్పబడుతున్న కొన్ని సంఘటనలను, వ్యక్తుల నిజస్వరూపాల్ని యాధాతధంగా చూపుతారా లేదా అనేదే ప్రేక్షకుల సందేహం.  ఈ సందేహాలకు సమాధానం ‘మహానాయకుడు’ విడుదలకానున్న ఫిబ్రవరి 7వ తేదీనాడే దొరకనుంది.