Home రాజకీయాలు జగన్ పై హత్యాయత్నం.. అలా ఐతే కుట్ర బయటకొస్తుంది!

జగన్ పై హత్యాయత్నం.. అలా ఐతే కుట్ర బయటకొస్తుంది!

SHARE

వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత జగన్ మోహన్ రెడ్డి మీద జరిగిన హత్యాయత్నం విషయంలో ప్రభుత్వం కొత్త కొత్త కథలను చెబుతూనే ఉంది. ముందుగా జగన్ పై హత్యాయత్నం జరిగిన వెంటనే..చంద్రబాబుతో సహా ప్రభుత్వ ముఖ్యులంతా స్పందించేశారు. డీజీపీ కూడా ఎలాంటి విచారణ లేకుండానే మాట్లాడేశాడు. జగన్ మీద దాడి చేసిన వ్యక్తి జగన్ అభిమానే అని డీజీపీ చెప్పుకొచ్చాడు. అందుకు ఆధారం ఏమిటో ఆయన చెప్పలేదు.

ఇక తెలుగుదేశం పార్టీనేతలు.. చంద్రబాబు నాయుడు అయితే.. వెకిలి నవ్వులు నవ్వుతూ ఏదేదో మాట్లాడారు. చంద్రబాబు నాయుడు ముసి ముసి నవ్వులు నవ్వాడు. మరి కొందరు తెలుగుదేశం నేతలు.. అది జగన్ మీద జగన్ చేయించుకున్న దాడి అని, అలా కూడా కాదు.విజయమ్మ, షర్మిలలు జగన్ మీద దాడి చేయించారని ఇలా నోటికి వచ్చినట్టుగా మాట్లాడారు.

జగన్ పై జరిగిన హత్యాయత్నం విషయంలో చంద్రబాబు నాయుడి ప్రభుత్వంలోని వారి మాటలు విన్నాకా.. వీళ్ల విచారణ సవ్యంగా ఉంటుందనే నమ్మకం ఎవరిలోనూ కలగలేదు.

ఇక తాజాగా కొత్త విషయాన్నిచెబుతున్నారు. సంచలనం కోసమే జగన్ పై నిందితుడు హత్యాయత్నం చేశాడని పోలీసులు ప్రకటించారు. అంటే ఇప్పటి వరకూ చెప్పిన కథలకు కాస్త భిన్నమై కథ. ఈ హత్యాయత్నంలో పాత్రధారే తప్ప.. కుట్రదారులను ఎవరు అనేది సందేహం. అయితే కుట్రదారులు అంటూ ఎవరూ లేరని, సంచలనం కోసమే నిందితుడు అలా చేశాడని ఇప్పుడు చెబుతున్నారు.

మొదట్లో చెప్పిన కథకూ ఇప్పటికీ కాస్త తేడా ఉంది. అయితే అసలు కథ ఇది కాదని.. రేపటి ఎన్నికల తర్వాత జగన్ ప్రభుత్వం ఏర్పడితే.. అప్పుడు అసలు కథ బయటకువచ్చే అవకాశం ఉందని విశ్లేషకులు అంటున్నారు.