Home ప్రత్యేకం బాబూ.. ప్రతిపైసాకు లెక్కచెప్పాలి : మోదీ

బాబూ.. ప్రతిపైసాకు లెక్కచెప్పాలి : మోదీ

SHARE

ఏపీలో టీడీపీ సర్కార్‌పై ప్రధాని నరేంద్ర మోదీ నిప్పులు చెరిగారు. చంద్రబాబు సర్కార్‌ నిత్యం అబద్ధాలు చెబుతూ ప్రజలను మభ్యపెడుతోందని దుయ్యబట్టారు. చంద్రబాబు ప్రభుత్వం కుంభకోణాల్లో కూరుకుపోయిందని ఆరోపించారు.

ఇది వరకు ఏ ప్రభుత్వం ఇవ్వలేని విధంగా ఆంధ్రప్రదేశ్‌కు కేంద్రం సాయం చేసిందని ప్రధాని నరేంద్ర మోడీ అన్నారు. ఆయన ఏపీ బీజేపీ బూత్‌ స్ధాయి కార్యకర్తలతో ప్రధాని బుదవారం వీడియో కాన్ఫరెన్స్‌లో మాట్లాడారు. ఏపీకి చెందిన విశాఖ, విజయనగరం, కాకినాడ, మచిలిపట్నం, నర్సాపూర్‌ లోక్‌సభ స్థానాలకు చెందిన బూత్‌ కార్యకర్తలతో ఆన్‌లైన్‌లో మాట్లాడారు. ఈ సందర్భంగా ఆయన ఏపీ సీఎం చంద్రబాబుపై తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. కేంద్రం నుంచి నిధులు తీసుకుంటున్న రాష్ట్ర ప్రభుత్వం ప్రతిపైసాకు లెక్క చెప్పాల్సి ఉంటుందన్నారు. నిధులను పక్కదారి మళ్లించినా వదిలేది లేదన్నారు.

రెవెన్యూ లోటు కింద ఇప్పటి వరకు రాష్ట్రానికి రూ. 20,000 కోట్లు ఇచ్చామని.. రాష్ట్రం మాత్రం తమకు రాలేదని అంటోందని.. మరి ఈ నిధులు ఎక్కడికి వెళ్లాయని ఆయన ప్రశ్నించారు. కార్యకర్తలు కూడా చంద్రబాబును నిలదీయాలని ఆయన అన్నారు. వెనుకబడిన జిల్లాలకు రూ. 1000 కోట్లు ఇచ్చామని చెప్పారు. పోలవరం కోసం ఇప్పటి వరకు రూ. 7000 కోట్లు ఇచ్చామన్న ప్రధాని.. ఈ సందర్భంగా పోలవరంపై కాగ్‌ ప్రస్తావించిన అంశాలను పేర్కొన్నారు. పోలవరం పూర్తిగా కేంద్ర నిధులతోనే నిర్మితమౌతోందని ఆయన స్పష్టం చేశారు. దేశ చరిత్రలో ఎన్నడూ లేని విధంగా ఏపీకి పది జాతీయ స్థాయి విద్యా సంస్థలను ఇచ్చామని చెప్పారు. అయితే చంద్రబాబు ప్రభుత్వం మాత్రం ప్రజలకు ఇచ్చిన వాగ్ధానాలను నెరవేర్చడంలో పూర్తిగా విఫలమైందని నరేంద్ర మోడీ అన్నారు.