Home రాజకీయాలు అదే జరిగితే.. పవన్ కల్యాణ్ పచ్చి మోసగాడు కాడా!

అదే జరిగితే.. పవన్ కల్యాణ్ పచ్చి మోసగాడు కాడా!

SHARE

జనసేనతో తమ పార్టీ పొత్తు పెట్టుకుంటే వైసీపీకి అభ్యంతరం ఏమిటి? అని ప్రశ్నించాడు చంద్రబాబు నాయుడు.ఈ విషయంలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి ఉన్న అభ్యంతరాల సంగతిని పక్కన పెడితే.. జనాలు ఏమనుకుంటారు అనేది చంద్రబాబు నాయుడు పరిశీలించుకోవాలి.

చంద్రబాబు నాయుడు అంటే.. పచ్చి అవకాశవాది, ఆయన తన అవసరానికి అనుగుణంగా ఎవరితోనైనా చేతులు కలుపుతాడు. కాంగ్రెస్ పార్టీతోనే చేతులు కలిపిన చంద్రబాబు ఇప్పుడు పవన్ కల్యాణ్ తో చేతులు కలపడం ఏ మాత్రం సిగ్గు అనిపించే వ్యవహారం కాకపోవచ్చు.

చంద్రబాబు సంగతలా ఉంటే.. పవన్ కల్యాణ్ పరిస్థితి ఏమిటి? అనేదే అసలైన చర్చ. ఎందుకంటే.. పవన్ కల్యాణ్ గనుక ఇప్పుడు వెళ్లి చంద్రబాబుతో చేతులు కలిపితే ఈయన కూడా పచ్చి అవకాశవాది అవుతాడు.

ఇన్ని రోజులూ చంద్రబాబును, లోకేష్ బాబును, టీడీపీ నేతలను, మంత్రులను పవన్ కల్యాణ్ ఎలా తిట్టాడో అందరికీ తెలిసిందే, చంద్రబాబుకు రిటైర్మెంట్ కు టైమొచ్చిందని.. ఆయన పాలన ఒక కులానికి అనుకూలంగా, అవినీతి మయంగా సాగుతోందని పవన్ అన్నాడు. లోకేష్ ను చాలా రకాలుగా విమర్శించాడు పవన్ కల్యాణ్.

ఇక ఏపీ మంత్రులను, టీడీపీ ఎమ్మెల్యేలను, నేతలను పవన్ కల్యాణ్ ఎన్నో రకాలుగా విమర్శించాడు. ఇప్పుడు బాబు పొత్తుకు పిలుస్తున్నాడు. ఈ పొత్తు పిలుపుకు గనుక స్పందించి వెళితే పవన్ కల్యాణ్ అప్పుడు చంద్రబాబు కన్నా పచ్చి అవకాశవాది అవుతాడని విశ్లేషకులు వ్యాఖ్యానిస్తున్నారు.