Home రాజకీయాలు చంద్రబాబును ఎద్దేవ చేసిన మోడీ

చంద్రబాబును ఎద్దేవ చేసిన మోడీ

SHARE

ప్రధాని నరేంద్ర మోదీ నేటి ఉదయం ఏఎన్ ఐ వార్తా సంస్థకు ఇచ్చిన సుదీర్ఘ ఇంటర్వ్యూలో మోదీ చాలా అంశాలపై మాట్లాడారు.  ఈ సందర్భంగా తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు కేసీఆర్ – చంద్రబాబుల ఆధ్వర్యంలో నిర్మితమవుతున్నాయని ప్రచారం జరుగుతున్న మహా కూటమి – ఫెడరల్ ఫ్రంట్ లపై వచ్చిన ప్రశ్నకు స్పందించిన మోదీ… ఎపి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడును ప్రదాని నరేంద్ర మోడీ ఎద్దేవ చేశారు.

తెలంగాణలో కాంగ్రెస్ తో కలిసి మహాకూటమి ఏర్పాటుకు చొరవ చూపిన చంద్రబాబు నాయుడు ఘోరంగా విఫలం అయ్యారని ఆయన అన్నారు. అక్కడే కూటమికి తొలి దెబ్బ తగిలిందని ఆయన అన్నారు. సిద్ధాంతాలను పక్కనపెట్టి చంద్రబాబు కాంగ్రెస్‌ పంచన చేరారని మండిపడ్డారు. మోదీ ఆశీస్సులతోనే తెలంగాణ సీఎం కేసీఆర్‌ ఫెడరల్‌ ఫ్రంట్‌ ఏర్పాటుకు ప్రయత్నిస్తున్నారన్న చంద్రబాబు ఆరోపణలను తిప్పికొట్టారు. సిద్ధాంత వైరుధ్యాలున్న పార్టీలు మోదీ ఓటమే అజెండాగా ఏకమవడాన్ని ప్రజలు తిప్పికొడతారని అన్నారు. తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో మహాకూటమి ప్రయోగం విఫలమైందని అన్నారు.

మొత్తంగా చంద్రబాబును నేరుగానే టార్గెట్ చేసిన మోదీ.. తనదైన శైలిలో లాజికల్ గా విమర్శలు గుప్పించారు. కేసీఆర్ సంధించిన ప్రశ్నలకే సమాధానం చెప్పలేక జట్టు పీక్కుంటున్న చంద్రబాబు.. మరి మోదీ విమర్శలకు ఎలా స్పందిస్తారో చూడాలన్న విశ్లేషణలు సాగుతున్నాయి.