Home రాజకీయాలు టీడీపీతో పొత్తు ఉండదంటున్న జనసేన!

టీడీపీతో పొత్తు ఉండదంటున్న జనసేన!

SHARE

తెలుగుదేశం పార్టీతో తమ పార్టీ పొత్తు ఉండదని జనసేన అంటోంది. జనసేన పార్టీ అధికార ప్రతినిధి ఒకరు మాట్లాడుతూ.. చంద్రబాబు నాయుడు ఏ ఉద్దేశంతో అలా మాట్లాడాడో తమకు తెలియదని.. తమ పార్టీ మాత్రం తెలుగుదేశంతో పొత్తు పెట్టుకునేందుకు సిద్ధంగా ఆయన అన్నాడు.

జనసేనతో తెలుగుదేశం పార్టీ పొత్తు పెట్టుకుంటే తప్పేంటి? అని చంద్రబాబు నాయుడు ప్రశ్నించిన సంగతి తెలిసిందే. కొన్నాళ్లుగా టీడీపీ, జనసేనలు రకరకాలుగా విమర్శించుకున్నాయి. అయితే చంద్రబాబు నాయుడు మాత్రం పొత్తుకు సై అని బహిరంగంగా సంకేతాలు ఇచ్చాడు. ఈ నేపథ్యంలో జనసేన ప్రతినిధి ఒకరు స్పందించారు.

తమ పార్టీ ఏపీలోని అన్ని అసెంబ్లీ స్థానాల్లోనూ.. అన్ని ఎంపీ సీట్లలోనూ పోటీ చేస్తుందని ఆయన ప్రకటించాడు. ఇదే విషయాన్ని తమ పార్టీ అధినేత పవన్ కల్యాణ్ తమకు చెప్పాడని.. ఆయన అంటున్నాడు.

అయితే బాబు అలా మాట్లాడటంతో చాలా రకాల అనుమానాలు రేగాయి. ఈ విషయంలో ముందు ముందు పవన్ కల్యాణ్ ఏమంటాడో తేలితే కానీ..ఈ విషయంపై స్పష్టత లేనట్టే. అసలే మాత్రం అవకాశం లేకుండా చంద్రబాబు నాయుడు అలా మాట్లాడి ఉంటాడా? అనేది సందేహం!