Home రాజకీయాలు పవన్‌పై చంద్రబాబు ఆసక్తికర వ్యాఖ్యలు

పవన్‌పై చంద్రబాబు ఆసక్తికర వ్యాఖ్యలు

SHARE

టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు జనసేన పార్టీతో స్నేహంపై, జనసేన అధినేత పవన్ కల్యాణ్‌పై వైసీపీ అధినేత జగన్ విమర్శలపై ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశారు. పవన్ టీడీపీ కలిసి పోటీ చేస్తే జగన్ కు బాధేంటి? అని ప్రశ్నించిన ఆయన.. అసలు జగన్ ఎవరితో ఉన్నాడో.. ఎవరితో వెళ్తున్నాడో చెప్పాలని డిమాండ్ చేశారు. పవన్ కల్యాణ్‌ మాతో రాకూడదు అనే ఉద్దేశంతోనే వైఎస్ జగన్ తిడుతున్నారని.. ఈ మధ్యనే ఇది ఎక్కువైందన్నారు. బీజేపీకి వ్యతిరేకంగా కలిసి రావాలనే మేం పవన్‌ను కోరుతున్నామన్న ఏపీ సీఎం.. జనసేనతో పొత్తు ఉంటుందా? అనే వ్యాఖ్యలను ఖండించలేదు.. అయితే జనసేన, టీడీపీ కలిసి పోటీ చేస్తాయనే ఊహాజనిత వ్యాఖ్యలపై సమయం వచ్చినప్పుడు స్పందిస్తానన్నారు.

పవన్‌తోనే తాము కలిసి ఉన్నామంటూ చంద్రబాబు మాట్లాడిన తీరు ప్రస్తుతం రాజకీయంగా చర్చనీయాంశమైంది. పవన్‌తో టీడీపీ బంధం కొనసాగుతోందా? అనే సందేహాలు సామాన్య ప్రజలకు కలుగుతున్నాయి. టీడీపీ, జనసేనల మధ్య అంతర్గతంగా బంధం కొనసాగుతుందనే ఆరోపణలకు చంద్రబాబు తాజా వ్యాఖ్యలు బలం చేకూర్చేలా ఉన్నాయి.