Home రాజకీయాలు నిస్సిగ్గు బాబు.. మరో నికృష్ట రాజకీయం!

నిస్సిగ్గు బాబు.. మరో నికృష్ట రాజకీయం!

SHARE

మొన్నటి వరకూ పవన్ కల్యాణ్ ను చంద్రబాబు నాయుడు ఏమన్నాడు అనే సంగతి తెలిసిందే. పవన్ కల్యాణ్ ను మోడీ మనిషి అని చంద్రబాబు నాయుడు అన్నాడు. సరిగ్గా తాము ఎన్డీయే నుంచి బయటకు రాగానే పవన్ కల్యాణ్ తమను విమర్శించడం మొదలుపెట్టాడని.. అలా మోడీ మనిషిగా పవన్ కల్యాణ్ పని చేస్తున్నాడంటూ చంద్రబాబు నాయుడు ధ్వజమెత్తాడు. ఒకసారి కాదు.. అనేక మార్లు అదే మాట మాట్లాడాడు.

తెలంగాణలో కూడా పవన్ కల్యాణ్ టీఆర్ఎస్ కు సహకరించాడని.. తెరాస అధినేత కేసీఆర్ కూడా మోడీ మనిషే అని బాబు చెప్పుకొచ్చాడు. అయితే రెండు మూడు రోజులుగా పవన్ విషయంలో బాబు మాటలు మారుతూ వచ్చాయి కేవలం కేసీఆర్, జగన్ లు మాత్రమే మోడీ మనుషులు అన్నట్టుగా బాబు వ్యాఖ్యానించాడు.

ఇక పవన్ కల్యాన్ తో పొత్తుకు కూడా సై అని చంద్రబాబు నాయుడు సిగ్నల్ ఇచ్చేశాడు. ఇది బాబు నిస్సిగ్గు స్వరూపం అని చెప్పవచ్చు. బాబు అవకాశవాదంలో ఇది మరో చాప్టర్ అని చెప్పవచ్చు.

చంద్రబాబు నాయుడు దశాబ్దాల పాటు కాంగ్రెస్ పార్టీని తిట్టాడు. ఆ పార్టీతో ఇటీవలే పొత్తును ఖరారు చేసుకున్నాడు. జాతీయ స్థాయిలో కాంగ్రెస్ కు మిత్రుడిగా మారిపోయాడు. ఇక బీజేపీని మొన్నటి వరకూ భుజాల మీద మోశాడు. మోడీ మళ్లీ ప్రధాని కావాలంటూ తీర్మానాలు పెట్టాడు. ఇప్పుడు మోడీని తిడుతున్నాడు.

అలాంటి మోడీ మనిషి అని పవన్ కల్యాణ్ ను విమర్శించాడు. ఇప్పుడు మళ్లీ పవన్ తో స్నేహానికి ప్రయత్నాలు చేస్తున్నాడు. బాబు నిస్సిగ్గు స్వరూపంలో ఇది మరో నికృష్ట రాజకీయం అని సామాన్యులు అంటున్నారు.