Home ట్రైలర్స్ టీజర్ : మిస్టర్ మజ్ను.. హ్యూమన్ టచ్ కావాలంటున్న అఖిల్

టీజర్ : మిస్టర్ మజ్ను.. హ్యూమన్ టచ్ కావాలంటున్న అఖిల్

SHARE

అక్కినేని అఖిల్ హీరోగా నటిస్తున్న ‘Mr. మజ్ను’ సినిమా టీజర్ కాసేపటి క్రితం రిలీజ్ అయింది. ఈ సినిమా ఒక రొమాంటిక్ ఎంటర్టైనర్ గా తెరకేకనున్ద్నంన్ సంగతి తెలిసిందే. దానికి తగ్గట్టే 56 సెకండ్ల ట్రైలర్ లో ప్లేబాయ్ రొమాన్స్.. హీరోయిన్ అనుమానాలు.. కాస్త ఎమోషన్ అంతా చూపించారు.

సినిమాలో మెజారిటీ భాగాన్ని లండన్ లోకేషన్స్ లో చిత్రీకరించడంతో లోకేషన్స్ బాగున్నాయి. ప్రొడక్షన్ వ్యాల్యూస్ రిచ్ గా ఉన్నాయి.  జార్జ్ సీ విలియమ్స్ సినిమాటోగ్రఫీ.. థమన్ బ్యాక్ గ్రౌండ్ స్కోర్ రెండూ సినిమాకు తగ్గట్టు అందంగా ఉన్నాయి.  ‘Mr. మజ్ను’ లో అఖిల్ స్టైలిష్ లుక్స్, టెంక్షన్ పోవాలంటే హ్యూమన్ టచ్ కావాల్సిందే అంటూ ఆయన చెప్పిన రొమాంటిక్ డైలాగ్స్ బాగా ఆకట్టుకుంటున్నాయి.  ఈ టీజర్ కారణంగా సినిమాపై అంచనాలు మరింత ఎక్కువయ్యాయి.  ‘తొలిప్రేమ’ ఫేమ్ వెంకీ అట్లూరి దర్శకత్వంలో రూపొందిన ఈ చిత్రాన్ని జనవరి 25న రిలీజ్ చేయనున్నారు.