Home సినిమా విశాల్ పెళ్లి కన్ఫర్మ్.. తెలుగమ్మాయితోనే!

విశాల్ పెళ్లి కన్ఫర్మ్.. తెలుగమ్మాయితోనే!

SHARE

నటుడు విశాల్ పెళ్లి చేసుకోబోతున్నట్టుగా తెలుస్తోంది. బ్యాచిలర్ సౌతిండియన్ హీరోస్ లో ప్రముఖుడు అయిన విశాల్ తెలుగు వాడని వేరే చెప్పనక్కర్లేదు. విశాల్ తండ్రి జీకే రెడ్డిది కోస్తా ప్రాంతం. తెలుగులో నిర్మాతగా పలు సినిమాలు రూపొందించిన ఆయన చెన్నైలోనే సెటిలయ్యాడు. ఆయన పిల్లలు అక్కడే పెరిగారు.

సినిమా రంగం పట్ల ఆసక్తుడు అయిన విశాల్ ఇండస్ట్రీకి అసిస్టెంట్ డైరెక్టర్ గా వచ్చి హీరోగా సెటిలయ్యాడు. తమిళంతో పాటు తెలుగులో కూడా గుర్తింపును సంపాదించుకున్నాడు. ఇక్కడ కూడా ఈ హీరోకి మార్కెట్ ఉంది. విశాల్ అన్న నిర్మాతగా వ్యవహరిస్తూ ఉంటాడు.
ఇక కేవలం నటుడిగా ఆగిపోకుండా తనలోని నాయకత్వ లక్షణాలతో తమిళ నడిగర్ సంఘం కు విశాల్ పోటీ చేశాడు. ఈ పోటీలో విశాల్ ప్యానల్ నెగ్గింది. అలాగే తమిళ నిర్మాతల మండలిలో కూడా విశాల్ కీలక పదవిలో ఉన్నాడు.

ఇక విశాల్ పెళ్లి కూడా ఇది వరకూ చర్చనీయాంశంగా నిలిచింది. తమిళ నటీనటుల భవనాన్ని నిర్మించే వరకూ తను పెళ్లి చేసుకునే ప్రసక్తి లేదని విశాల్ ఇది వరకూ ప్రకటించాడు. ఇప్పుడు ఆ భవన నిర్మాణం కూడా పూర్తి కావస్తోంది. నూతన సంవత్సరంలో మార్చిలో ఆ భవనం ప్రారంభం అయ్యే అవకాశాలున్నాయి.

ఇక విశాల్ పెళ్లి కూడా త్వరలోనే అని తెలుస్తోంది. హైదరాబాద్ కు చెందిన ఒక వ్యాపారవేత్త కూతురును విశాల్ పెళ్లి చేసుకోబోతున్నాడట. త్వరలోనే విశాల్ కుటుంబం పూర్తి వివరాలను ప్రకటించబోతోందని సమాచారం.

విశాల్ అన్న కూడా తెలుగు మూలాలున్న శ్రియా రెడ్డినే పెళ్లి చేసుకున్నాడు. టీమిండియా మాజీ క్రికెటర్ భరత్ రెడ్డి కూతురే శ్రియా రెడ్డి.