Home సినిమా మహర్షి సెకండ్ లుక్

మహర్షి సెకండ్ లుక్

SHARE

టాలీవుడ్ ‘సూపర్‌ స్టార్‌’ మహేష్‌ బాబు హీరోగా తెరకెక్కుతున్న సినిమా ‘మహర్షి’. దిల్‌రాజు, అశ్వినిదత్‌, ప్రసాద్‌ వి పొట్లూరి సంయుక్తంగా ఈ సినిమాను నిర్మిస్తున్నారు. మహేష్ ఇందులో కాలేజీ స్టూడెంట్ గా కనిపిస్తున్నారు. మహేష్ కు జోడిగా పూజా హెగ్డే నటిస్తోంది. ఈ సినిమా రిలీజ్‌కు ముందుగానే టాక్‌ ఆఫ్‌ ద టౌన్‌ గా నిలుస్తోంది.

ఈ సినిమాలో మహేష్‌ లుక్‌ స్పెషల్‌ అట్రాక్షన్‌గా నిలుస్తుందని దర్శకుడు వంశీ పైడిపల్లి ఇంతకుముందే చెప్పాడు. అందుకు తగ్గట్టుగానే మహేష్‌ పాత్రకు సంబంధించిన కొత్త లుక్‌ను ఈ రోజు విడుదల చేశారు. ఫార్మల్ లుక్ లో మహేష్ అదరగొట్టాడు. మహేష్ కొత్త సంవత్సరం కానుక ఇచ్చారని అభిమానులు తెగ సంబరపడిపోతున్నారు.