Home రాజకీయాలు ఎదురుదెబ్బ పడ్డా.. ఏపీలో కలిసే పోటీనట!

ఎదురుదెబ్బ పడ్డా.. ఏపీలో కలిసే పోటీనట!

SHARE

తెలంగాణ అసెంబ్లీలో కాంగ్రెస్ టీడీపీల కూటమి ఎలాంటి ఫలితాన్ని ఎదుర్కొందో తెలిసిన సంగతే. చంద్రబాబు నాయుడుని ఎన్నికల ముందు తెచ్చి పెట్టుకుని కాంగ్రెస్ పార్టీ చిత్తు అయ్యింది. ఒకవేళ తెలంగాణలో చంద్రబాబుతో కలిసి పోటీ చేయకపోతే కాంగ్రెస్ పార్టీ పరిస్థితి బాగుండేదని.. చాలాసీట్లనే తెచ్చుకునేదని.. కేసీఆర్ కు గట్టి పోటీ ఇచ్చేదని పలువురు విశ్లేషకులు పేర్కొన్నారు. ఎన్నికల ముందు నుంచినే ఆ విశ్లేషణలు వినిపించాయి.

అయితే.. కాంగ్రెస్ పార్టీ నేతలు ఆ విషయాన్ని ఒప్పుకోవడం లేదు. పొత్తు వల్ల తాము ఓడలేదని.. ఈవీఎంల వల్ల తాము ఓడామని కాంగ్రెస్ నేతలు వాదిస్తున్నారు. ఈ వితాండ వాదానికి హద్దు లేకుండాపోయింది.

ఆ సంగతలాఉంటే.. ఏపీలో కూడా కాంగ్రెస్ పార్టీ, తెలుగుదేశం పార్టీలు కలసి పోటీ చేయనున్నాయట. ఈ విషయాన్ని ఏపీ కాంగ్రెస్ నేతలు చెబుతున్నారు. తెలంగాణలో ఎదురుదెబ్బ తగిలిన నేపథ్యంలో.. ఏపీలో కాంగ్రెస్, టీడీపీలు కలిసి పోటీ చేయవని.. అంత సాహసం చేయవని అంతా అనుకున్నారు.

అయితే అలాంటిది ఏమీ లేదని.. టీడీపీతో పొత్తు ఉంటుందని, కాంగ్రెస్ పార్టీ నేతలు బల్లగుద్ది చెబుతున్నారు. సీట్ల ఒప్పందం కుదిరిందని కూడా చెబుతున్నారు. మరి జనాలు ఇప్పటికే కాంగ్రెస్, టీడీపీ ల పొత్తును తిరస్కరించేశారు. అయినా వీరు తగ్గేలా లేదు. మరి తెలంగాణలో ఎదురైన అనుభవమే ఈ కూటమికి ఏపీలో కూడా తప్పదేమో!