Home రాజకీయాలు చంద్రబాబుకు అంత కులగజ్జి ఎందుకు?

చంద్రబాబుకు అంత కులగజ్జి ఎందుకు?

SHARE

‘ఎవరైనా ఎస్సీ కులంలో పుట్టాలని అనుకుంటారా…’
‘ప్రధానమంత్రి నరేంద్రమోడీ చిన్న కులం నుంచి వచ్చాడు…’
‘కేసీర్ నన్ను భట్రాజు పొగిడినట్టుగా పొగిడాడు…’

ఇవీ తెలుగుదేశం అధినేత, ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు చేసిన కుల దురహాంకారపు వ్యాఖ్యలు. వేరే ఎవరైనా రాజకీయ నేతలు కులం విషయంలో ఇలా మాట్లాడి ఉంటే వాళ్ల ఖేల్ ఖతం దుకాణ్ బంద్ అయ్యేది. అయితే అక్కడ ఉన్నది చంద్రబాబు కాబట్టి.. ఆయన ఎంత దారుణంగా మాట్లాడినా చెల్లిపోతోంది. చంద్రబాబు చేతిలో అధికారం ఉంది, ఆయన చేతిలో మీడియా వర్గాలున్నాయి కాబట్టి.. ఏమైనా మాట్లాడగలడు.

అయితే చంద్రబాబు నాయుడు కులం విషయంలో కూడా దారుణంగా మాట్లాడుతున్నాడు. బీసీలను, ఎస్సీలను దారుణంగా అవమనిస్తూ మాట్లాడటానికి కూడా చంద్రబాబు నాయుడు వెనుకాడటం లేదు. ఈ స్థాయిలో చంద్రబాబుకు కుల గజ్జి అల్లుకుంది అని విశ్లేషకులు అంటున్నారు.

చంద్రబాబు నాయుడు పాలనపై ఇప్పటికే కులం విషయంలో తీవ్ర విమర్శలున్నాయి. చంద్రబాబు నాయుడు తమ కులం వారిని ఉద్ధరించడానికే పాలిస్తున్నాడనే మాట వినిపిస్తోంది. చంద్రబాబు పాలన ఒక కుల రాజ్యంగా మారిందనే అభిప్రాయాలున్నాయి.

వాటికి తోడు ఇప్పుడు చంద్రబాబు నాయుడు ఇలా బడుగు బలహీన కులాలను కించపరిచేలా మాట్లాడుతూ ఉండటం విశేషం. చంద్రబాబు నాయుడు ఇలాంటి కుల వివక్షతో కూడిన మాటలను మానుకోకుండా.. అదే తీరును కొనసాగిస్తూ ఉన్నాడు.