Home రాజకీయాలు లేటెస్ట్ అప్డేట్.. బాబు గ్రాఫ్ మరింత డౌన్!

లేటెస్ట్ అప్డేట్.. బాబు గ్రాఫ్ మరింత డౌన్!

SHARE

తెలంగాణ ఎన్నికల్లో ఎదురైన ఫలితాలు చంద్రబాబు రాజకీయ పరిస్థితిని ఏపీలో చాలా వరకూ దిగజార్చాయి. చంద్రబాబు నాయుడు ఏదో మ్యాజిక్ చేస్తాడు… తమ పార్టీని మళ్లీ గెలిపించస్తాడని చాలా మంది తెలుగుదేశం కార్యకర్తలు, నేతలు ఆశలతో ఉన్నారు. అయితే బాబు గేమ్స్ ప్రతి సారీ చెల్లవని తెలంగాణ ఎన్నికలతో స్పష్టం అయ్యింది. తెలంగాణలో టీడీపీ అన్ని సీట్లకూ పోటీ చేయకపోయినా.. పోటీ చేసిన చోట పరువు నిలబెట్టుకోలేకపోయింది.

కూకట్ పల్లిలో తెలుగుదేశం పార్టీ తన శక్తులన్నింటినీ కూర్చి కూడా నెగ్గలేకపోయింది. అక్కడ నందమూరి సుహాసిని చిత్తుగా ఓడింది. ఇది తెలుగుదేశం పార్టీ శ్రేణుల స్థైర్యాన్ని చాలా వరకూ దెబ్బ తీసింది.

తెలంగాణలో టీడీపీ కాస్త పరువు నిలబెట్టుకుని ఉన్నా.. ఏపీలో మళ్లీ తమదే విజయం అని పచ్చచొక్కాలు కాలర్ ఏగరేసేవి. అయితే తెలంగాణ ఎన్నికల ఫలితాలు వారి స్థైర్యాన్ని దెబ్బ తీశాయి.

ఇక తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్.. ఏపీలో కూడా ఇప్పుడు మంచి పాపులారిటీ సంపాదించుకున్నాడు. గతంలోలా కేసీఆర్ అంటే గుడ్డి వ్యతిరేకత ఏమీ లేదు. హైదరాబాద్ లో సీమాంధ్రులకు ఎలాంటి ఇబ్బందులు లేకపోవడంతో కేసీఆర్ మీద కూడా అక్కడ యాక్సెప్టెన్స్ వచ్చింది.

ఇలాంటి నేపథ్యంలో చంద్రబాబు మీద కేసీఆర్ విరుచుకుపడ్డాడు. బాబు విశ్వసనీయతను ప్రశ్నించాడు. బాబు అవకాశదాన్ని, ద్వంద్వ వైఖరిని ఎండగట్టిన తీరు ఏపీ ప్రజల్లోకి బాగా వెళ్లింది.

ఒకవైపు వైసీపీ ఇవే పాయింట్ల మీద మాట్లాడుతూ ఉంది. ఇప్పుడు కేసీఆర్ కూడా అవే విషయాల్లో బాబు తీరును ఎండగట్టడంతో తెలుగుదేశం గ్రాఫ్ మరింత డౌన్ అయ్యిందని విశ్లేషకులు అంటున్నారు. బాబు మళ్లీ గెలిచే పరిస్థితి ఇక లేదని.. ఎన్నికలు దగ్గరపడుతున్న తరుణంలో బాబు గ్రాఫ్ రోజురోజుకూ పతనావస్థను చూస్తోందని అంటున్నారు.