Home రాజకీయాలు విజయవాడ చేరుకున్న హైకోర్టు న్యాయమూర్తులు, ఉద్యోగులు

విజయవాడ చేరుకున్న హైకోర్టు న్యాయమూర్తులు, ఉద్యోగులు

SHARE

తెలుగు రాష్ట్రాల ఉమ్మడి హైకోర్టు అధ్యాయం సోమవారంతో ముగియనుంది. జనవరి 1 నుంచి ఆంధ్రప్రదేశ్‌, తెలంగాణ హైకోర్టులు వేర్వేరుగా పనిచేయనున్నాయి. రేపటి నుంచి అమరావతి నుంచే ఆ రాష్ట్ర హైకోర్టు పనిచేయనుంది. ఇందుకోసం హైదరాబాద్‌ నుంచి అమరావతికి 900 మంది ఉద్యోగులు తరలివెళ్లారు. వీరంతా బస్సుల్లో విజయవాడకు చేరుకున్నారు.

వీరికి జిల్లా న్యాయమూర్తి, పోలీస్ కమిషనర్ లు స్వాగతం పలికారు. హైకోర్ట్ ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ప్రవీణ్ కుమార్ గార్డ్ ఆఫ్ హనర్ అందుకున్నారు. రాత్రి 7 గంటలకు దుర్గమ్మ దర్శనానికి న్యాయమూర్తులు వెళ్లనున్నారు. ఈ రోజు నోవాటెల్ హోటల్ లో న్యాయమూర్తులు బస చేస్తారు. రేపు ఉదయం ఇందిరా గాంధీ స్టేడియంలో ప్రమాణ స్వీకారం చేయనున్నారు.