Home రాజకీయాలు కేసీఆర్ కు కౌంటర్ ఇవ్వలేక టీడీపీ తంటాలు!

కేసీఆర్ కు కౌంటర్ ఇవ్వలేక టీడీపీ తంటాలు!

SHARE

తమ పార్టీ అధినేత చంద్రబాబు మీద కేసీఆర్ తీవ్రంగా విరుచుకుపడిన వైనం పై తెలుగుదేశం పార్టీ ఘాటుగా రిప్లై ఇవ్వలేకపోతోంది. చంద్రబాబు విధానాల గురించి కేసీఆర్ తీవ్రంగా ధ్వజమెత్తిన సంగతి తెలిసిందే. చంద్రబాబునాయుడి అవకాశవాదం గురించి, ద్వంద్వ వైఖరి గురించి కేసీఆర్ ఘాటుగా విరుచుకుపడ్డాడు. వివిధ అంశాలలో చంద్రబాబు నాయుడి వైఖరిని కేసీఆర్ తీవ్రంగా తప్పు పట్టాడు.

కేసీఆర్ ప్రెస్ మీట్ టాక్ ఆఫ్ ద టౌన్ అయ్యింది. అంతటా దీని గురించి చర్చించుకుంటూ ఉన్నారు. తెలంగాణలో కన్నా ఏపీలో దీనిపై గట్టిగా చర్చ జరుగుతూ ఉంది. ఈ నేపథ్యంలో తెలుగుదేశం పార్టీ స్పందించక తప్పలేదు.

అందుకే వరస పెట్టి తెలుగుదేశం నేతలు స్పందించారు. అరడజను మందికిపైనే స్పందించారు. అయితే.. అంతమంది స్పందించినా కేసీఆర్ కు మాత్రం గట్టిగా కౌంటర్ ఇచ్చింది లేదు. కేసీఆర్ దళితుడికి ముఖ్యమంత్రి పదవిని ఇస్తానని అన్నాడు, కేసీఆర్ తీవ్రరమైన భాష వాడాడు అంటూ తెలుగుదేశం నేతలు విరుచుకుపడ్డారు.

అయితే.. కేసీఆర్ ప్రస్తావించిన అంశాల వారీగా మాత్రం టీడీపీ నేతలు స్పందించలేదు. మొత్తానికి కేసీఆర్ విరుచుకుపడితే తెలుగుదేశం పార్టీ గట్టిగా సమాధానం కూడా ఇవ్వలేకపోయింది. ఏదో స్పందించాలంటే స్పందించాలన్నట్టుగా మాట్లాడారు కానీ.. అంతకు మించి టీడీపీ నేతల మాటల్లో పంచ్ లేదు!