Home రాజకీయాలు కేసీఆర్ ప్రెస్ మీట్.. ప్రధాన పంచ్ లు ఇవే!

కేసీఆర్ ప్రెస్ మీట్.. ప్రధాన పంచ్ లు ఇవే!

SHARE

తన మీద రన్నింగ్ కామెంట్రీ చేసిన ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు మీద కేసీఆర్ తీవ్రంగా విరుచుకుపడ్డాడు. దాదాపు గంటన్నర పాటు ప్రెస్ మీట్లో ప్రసంగించిన కేసీఆర్ అందులో సగం సేపు చంద్రబాబు నాయుడు మీద విరుచుకుపడటానికే కేటాయించాడు. ముందుగా తెలంగాణ పంచాయతీ ఎన్నికల రిజర్వేషన్ల విషయంలో తన వివరణ ఇచ్చిన కేసీఆర్.. ఆ తర్వాత చంద్రబాబు నాయుడు మీద విరుచుకుపడటం మొదలుపెట్టాడు.

అందులో ముఖ్యమైన పంచ్ లు ఇవే…

-ఏపీకి ప్రత్యేకహోదా విషయంలో చంద్రబాబు నాయుడు ఎన్నిరకాలుగా మాటలు మార్చాడో కేసీఆర్ ప్రస్తావించాడు. హోదా కావాలని ఒకసారి, వద్దని మరోసారి బాబు మాట మార్చిన వైనాలను కేసీఆర్ కడిగేశాడు.

-హైకోర్టు విభజన విషయంలో ముందుగా సుప్రీం కోర్టుకు అఫిడవిట్ సమర్పించింది నువ్వు కాదా చంద్రబాబు? అని కేసీఆర్ ప్రశ్నించాడు. ముందుగా హై కోర్టు విభజనకు ఓకే అని అఫిడవిట్ ఇచ్చి, ఇప్పుడు మాత్రం హడావుడిగా విభజన అంటూ మాట్లాడతావా చంద్రబాబు అని కేసీఆర్ పంచ్ వేశాడు.

-హైదరాబాద్ లో ఐటీ అభివృద్ధి లో చంద్రబాబు నాయుడికి ఎలాంటి సంబంధం లేదని కేసీఆర్ వ్యాఖ్యానించాడు. హైటెక్ సిటీ నిర్మాణం కాంగ్రెస్ హయాంలో మొదలైందనే విషయాన్ని ప్రస్తావించాడు.

-చంద్రబాబు నాయుడుకు పాలన చేత కావడం లేదని అందుకే అందరినీ విమర్శిస్తూ పబ్బం గడుపుకుంటున్నాడని కేసీఆర్ విరుచుకుపడ్డాడు.

-నందమూరి సుహాసిని పేరును కూడా కేసీఆర్ ప్రస్తావించాడు. ఆమెను కరివేపాకులా వాడి చంద్రబాబు నాయుడు పడేశాడని కేసీఆర్ అన్నాడు.

-నువ్వు ఒక దద్దమ్మవు, చేతగాని వాడని అంటూ కేసీఆర్ తీవ్రంగా విరుచుకుపడ్డాడు.