Home రాజకీయాలు పాదయాత్ర పూర్తి కాగానే.. కాలినడకన తిరుమలకు!

పాదయాత్ర పూర్తి కాగానే.. కాలినడకన తిరుమలకు!

SHARE

శ్రీకాకుళం జిల్లా ఇచ్చాపురంలో పాదయాత్ర పూర్తి కాగానే వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత జగన్ మోహన్ రెడ్డి డైరెక్టుగా తిరుపతికి చేరుకోనున్నాడని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ప్రకటించింది. ఈ మేరకు ఆ పార్టీ నేత భూమన కరుణాకర్ రెడ్డి మాట్లాడాడు. ఇచ్చాపురంలో యాత్ర పూర్తి కాగానే… జగన్ తిరుపతి చేరుకుంటారని, అక్కడ విశ్రాంతి తీసుకుని.. మరుసటి రోజు జగన్ తిరుమలకు కాలి నడకన వెళ్తారని భూమన ప్రకటించారు.

మెట్టు మార్గంలో జగన్ తిరుమల చేరుకుని శ్రీవారిని దర్శించుకుంటారని భూమన ప్రకటించాడు. పాదయాత్ర విజయవంతంగా పూర్తి అయిన నేపథ్యంలో ఇలాశ్రీవారిని దర్శించుకుని జగన్ మొక్కులు చెల్లించుకుంటారని భూమన పేర్కొన్నాడు.

ఇక పాదయాత్ర ముగింపు సభలో జగన్ అభ్యర్థుల ప్రకటన కూడా చేయనున్నాడనే వార్తలు వస్తున్నాయి,. ఈ అంశం మీద భూమన ఏమీ మాట్లాడలేదు. పాదయాత్ర ముగింపు సభలో జగన్ వందకుపైగా స్థానాల అభ్యర్థులను ప్రకటించనున్నాడనే మాట వినిపిస్తోంది. అయితే ఈ విషయంపై భూమన స్పందించలేదు. జనవరి రెండో వారంలో పాదయాత్ర పూర్తి కానుంది. ప్రజాసంకల్పయాత్రలో అభ్యర్థుల ప్రకటన ఉంటుందా లేదా అనే అంశంపై అప్పటికి క్లారిటీ రావొచ్చు!