Home రాజకీయాలు బాబు వల్ల కాదట.. దాని వల్లనే ఓడారట!

బాబు వల్ల కాదట.. దాని వల్లనే ఓడారట!

SHARE

తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమిపై కాంగ్రెస్ పార్టీ విశ్లేషణలు కొనసాగుతూ ఉన్నాయి. అయితే ఎన్ని విశ్లేషణలు చేసినా.. ఎవరు స్పందించినా ఒకటే మాట చెబుతున్నారు. తమ ఓటమికి ఒకే ఒకటి కారణమని కాంగ్రెస్ నేతలు అంటున్నారు. ఈవీఎంల మీద వీరు నెపాన్ని మోపుతున్నారు.

తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు పూర్తిగా రాకముందే.. కాంగ్రెస్ నేతలు చేతులు ఎత్తేశారు. ఈవీఎంల వల్లనే ఓడామని అన్నారు. ఇక ఫలితాలు వచ్చిన పక్షం రోజుల తర్వాత నిర్వహించిన సమీక్షలో కూడాకాంగ్రెస్ నేతలు అదే మాటే చెబుతున్నారు. ఉత్తమ్ కుమార్ రెడ్డి ఆధ్వర్యంలో జరిగిన సమీక్షలో ఇదే విషయాన్ని చెప్పారు.

ఈవీఎంల వల్లనే తాము ఓడిపోయామని ఉత్తమ్ చెప్పుకొచ్చాడు. మరి ఇది చెప్పడానికి సమీక్ష నిర్వహించాల్సిన అవసరం ఏమిటో ఉత్తమ్ కుమార్ రెడ్డికే తెలియాలి.

ఇక చంద్రబాబుతో పొత్తు వల్ల కాంగ్రెస్ పార్టీ ఓడిందనే విశ్లేషణను కూడా ఉత్తమ్ కొట్టిపడేశాడట. పొత్తుల వల్ల ఓడలేదని.. ఈవీఎంల వల్లనే ఓడామని అన్నారట. మరి గెలిచిన చోట ఏమో ఈవీఎంలను ఏమీ అనరు. ఓడిన చోట మాత్రం తప్పంతా ఈవీఎంలదే అంటున్నారు. అదీ కాంగ్రెస్ కథ!