Home రాజకీయాలు జనసేన-బీజేపీ.. పొత్తుతో వెళ్లనున్నాయా?

జనసేన-బీజేపీ.. పొత్తుతో వెళ్లనున్నాయా?

SHARE

తాము తెలుగుదేశం పార్టీతో పొత్తు పెట్టుకోవమని, అలాగే వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీతోనూ పొత్తు పెట్టుకోమని.. ఆ రెండు పార్టీలకూ తాము సమదూరం పాటిస్తామని అంటున్నారు బీజేపీ నేతలు. అయితే ఏపీలో పొత్తులకు మాత్రం సై అని వీరు చెబుతున్నారు. బీజేపీ జాతీయ నేతలే ఇలా మాట్లాడుతున్న నేపథ్యంలో.. బీజేపీ, జనసేనల పొత్తు పై మళ్లీ చర్చ మొదలైంది.

జనసేనతో తాము పొత్తుకు సై అన్నట్టుగా బీజేపీనేతలు మాట్లాడుతూ ఉన్నారు. బీజేపీ ఏపీలో సోలోగా పోటీ చేసి సాధించేది ఏమీలేదు. నియోజకర్గానికి యావరేజ్ మీద రెండు మూడు వేల ఓట్లు కూడా ఆ పార్టీకి పడే పరిస్థితి లేదు. అయితే బీజేపీకంటూ కొంత ఓటు బ్యాంకు ఉంది. పొత్తులకు తోడైతే అది ఉపయుక్తంగా ఉంటుంది. ఇలాంటి నేపథ్యంలో కమం పార్టీ జనసేన వైపు మొగ్గు చూపుతోందనే మాట వినిపిస్తోంది.

ఇక పొత్తుల విషయంలో జనసేన తీరు ఏమిటో ఎవరికీ అర్థం కావడం లేదు. ఒకసారేమో సోలోగా పోటీ అంటారు. మరోసారి కమ్యూనిస్టులతోపొత్తు అంటూ ఉంటారు. ఇటీవలే నాదెండ్ల మనోహర్ మాట్లాడుతూ.. తామ పార్టీ నూటా డెబ్బై ఐదు స్థానాల్లోనూ ఒంటరిగా పోటీ చేస్తుందని ప్రకటించాడు.

ఇప్పుడు జనసేనకు కమలం పార్టీ కన్నుగీటుతూ ఉంది. ఇప్పటి వరకూ మోడీని పవన్ కల్యాణ్ పెద్దగా విమర్శించింది కూడా ఏమీ లేదు. ఇలాంటి నేపథ్యంలో జనసేన- బీజేపీల పొత్తు ఏర్పడినా పెద్దగా ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదేమో!