Home రాజకీయాలు ప్రచార యావ.. ఆమెనూ వదలని చంద్రబాబు నాయుడు!

ప్రచార యావ.. ఆమెనూ వదలని చంద్రబాబు నాయుడు!

SHARE

ప్రచారం వస్తుందంటే.. ఫొటోలు దిగడానికి ఏ మాత్రం మొహమాట పడే టైపు కాదు చంద్రబాబు నాయుడు. ముఖ్యమంత్రిగా తనకు తీరిక లేనన్ని పనులు ఉన్నాయని చెబుతూ ఉంటాడు. రోజుకు పద్దెనిమిది గంటలపాటు తను కష్టపడుతూ ఉంటానని చెబుతూ ఉంటాడు. నిద్రలో కూడా రాష్ట్రం గురించి ఆలోచనలే అని అంటాడు.

చంద్రబాబుకు నిద్ర పట్టని జబ్బు ఉందని.. అందుకే ఆయన ఏదో ఒకటి ఆలోచిస్తూ ఉంటాడని ఇది వరకూ చాలా మంది నేతలు ఎద్దేవా చేశారు. అయితే వాటిని పట్టించుకోకుండా చంద్రబాబు నాయుడు ఏవో కబుర్లు చెబుతూ ఉంటాడు. అలాంటి కబుర్లతో బాబు అభాసుపాలవుతూ ఉంటాడు.

ఇక చంద్రబాబు ప్రచార యావ కొద్దీ ఈ మధ్య ఏ అవకాశాన్నీ వదలడం లేదు. తెలంగాణ ఎన్నికలు జరిగితే అక్కడకు వెళ్లి కూడా బాబు డబ్బా కొట్టుకున్నాడు. ఆ డబ్బా కొట్టుకోవడం తెలుగుదేశాన్ని, కూటమిని గెలిపించడం మాట అటుంచి.. తెరాసకు మంచి అవకాశంగా నిలిచింది. బాబును బూచిగా చూపించి తెరాస గట్టిగా ప్రచారం చేసుకుంది.

ఇక తాజాగా చంద్రబాబు నాయుడు సోషల్ మీడియదతో పాపులర్ అయిన విలేజ్ సింగర్ బేబీతో కూడా ఫొటోలు దిగాడు. ఆమెను సెక్రటేరియల్ లో కలిశాడు చంద్రబాబు నాయుడు. ఆమెను ప్రోత్సహిస్తామని చెప్పాడు. సంగీత దర్శకుడు ఏఆర్ రెహమాన్ బేబీ పాడిన ఒక పాటను షేర్ చేయడంతో ఆమెకు పాపులారిటీ వచ్చింది. సోషల్ మీడియాలో ఆమెకు ఫేమ్ వచ్చింది. ఇలాంటి నేపథ్యంలో చంద్రబాబు నాయుడు ఆమెతో ఫొటోలు దిగాడు. మరి ఆమెను వెలుగులోకి తీసుకొచ్చింది కూడా తనే అని చంద్రబాబు అంటాడేమో రేపటి నుంచి!