Home రాజకీయాలు కూకట్ పల్లిలో ఏం జరిగింది..? సుహాసిని పరిస్థితేంటి?

కూకట్ పల్లిలో ఏం జరిగింది..? సుహాసిని పరిస్థితేంటి?

SHARE

తెలుగుదేశం పార్టీకి అత్యంత ప్రతిష్టాత్మకమైన నియోజకవర్గం కూకట్ పల్లి. తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో ఆ పార్టీ పన్నెండు సీట్లలో పోటీలో నిలిచినా.. మిగతావి ఏమైనా ఫర్వాలేదు కేవలం కూకట్ పల్లిలో గెలిస్తే చాలన్నట్టుగా తెలుగుదేశం పార్టీ భావించింది. ఈ మేరకు అక్కడ అన్ని అస్త్రాలనూ సంధించి పోటీలోకి దిగింది.

కూకట్ పల్లిలో నందమూరి సుహాసినిని గెలిపించడానికి ఏపీ నుంచి టీడీపీ నేతలు దిగారు. వీళ్లు నోట్ల కట్టలతో దిగారని టాక్. ప్రత్యేకించి ఏపీ టీడీపీలోని కమ్మ నేతలు కూకట్ పల్లిలో మకాం పెట్టారు. ఆ ఏరియాల్లో ఇళ్లను కలిగిన వాళ్లు, ఇళ్లు లేని వాళ్లు కూడా కూకట్ పల్లిలో పక్షం రోజుల నుంచి సెటిల్ అయ్యారు. ఇంతలా ప్రతిష్టాత్మకంగా తీసుకుంది టీడీపీ.

ఈ నియోజకవర్గంలో టీడీపీ ఓటుకు ఐదు వేల రూపాయలు ఇచ్చిందని కూడా అంటున్నారు. ఇక పోలింగ్ పూర్తి అయ్యింది. ఇలాంటి నేపథ్యంలో ఈ నియోజకవర్గంలో పరిస్థితి ఏమిటి అంటే.. సందిగ్ధంగానే ఉంది. ప్రత్యేకించి పోలింగ్ శాతం తక్కువగా నమోదు కావడం విశేషం. పూర్తి స్థాయి సమాచారం ఇంకా అందుబాటులో లేదు కానీ.. యాభై శాతానికి అటూ ఇటూగా కూకట్ పల్లిలో పోలింగ్ శాతం నమోదైందని తెలుస్తోంది. ఇది చాలా స్వల్పమైన పోలింగే.

ఒకవేళ తెరాస అభ్యర్థి మీద వ్యతిరేకతే ఉంటే, సుహాసినిని గెలిపించాలని జనాలు అనుకుంటే పోలింగ్ శాతం మరింత మెరుగ్గా ఉండేదని విశ్లేషకులు అంటున్నారు. పోలింగ్ శాతాన్ని బట్టి చూస్తే సుహాసినికి పూర్తి అనుకూలత లేదని పరిశీలకులు అంటున్నారు. పరిస్థితి పోటాపోటీగా ఉండవచ్చునేమో!