Home రాజకీయాలు ఎగ్జిట్ పోల్స్ః కేసీఆర్ దే హవా…తెరాసకు ఎన్ని సీట్లంటే!

ఎగ్జిట్ పోల్స్ః కేసీఆర్ దే హవా…తెరాసకు ఎన్ని సీట్లంటే!

SHARE

తెలంగాణలో మరోసారి తెరాస ప్రభుత్వం ఏర్పడుతుందని ప్రకటించాయి వివిధ మీడియా సంస్థలు. పోలింగ్ అనంతరం ఎగ్జిట్ పోల్స్ రూపంలో తమ అంచనాలను వ్యక్తం చేసిన మీడియా వర్గాలు ఆసక్తికరమైన అంచనాలను వేశాయి. ప్రముఖ మీడియా వర్గాలు తెరాసదే విజయం అని ప్రకటించాయి.
వాటి అంచనాలు ఇలా ఉన్నాయి.

ఇండియాటుడే…

తెలంగాణ రాష్ట్ర సమితి – 71 నుంచి 91
కాంగ్రెస్ కూటమి – 21 నుంచి 33
బీజేపీ – మూడు
మజ్లిస్ – ఏడు

తెరాసదే విజయం అని అంటోంది టైమ్స్ నౌ ఎగ్జిట్ పోల్ కూడా. తెరాస అరవై ఆరు సీట్లు సంపాదించుకుంటుందని టైమ్స్ ఎగ్జిట్ పోల్ అంచనా వేసింది. కాంగ్రెస్ కూటమి 37 సీట్లు సాధించుకుంటుందని పేర్కొంది. బీజేపీ ఎనిమిది సీట్ల వరకూ నెగ్గవచ్చని పేర్కొంది. మజ్లిస్ ఏడు సీట్లను నిలబెట్టుకుంటుందని టైమ్స్ పేర్కొంది.

రిపబ్లిక్ టీవీ మాత్రం కాస్త గమ్మత్తైన ఎగ్జిట్ పోల్స్ ను అనౌన్స్ చేసింది. తెరాస 50 నుంచి 65 సీట్లను పొందగలదని, మహాకూటమి 38 నుంచి 52 సీట్లను నెగ్గుతుందని, బీజేపీ నాలుగు నుంచి ఏడు, ఇతరుల 10 నుంచి 17 సీట్లను పొందుతుందని ఈ అధ్యయనం అంచనా వేసింది.