Home రాజకీయాలు ఎగ్జిట్ పోల్స్ః బీజేపీకి కొంచెం తీపి, కొంచెం చేదు!

ఎగ్జిట్ పోల్స్ః బీజేపీకి కొంచెం తీపి, కొంచెం చేదు!

SHARE

అసెంబ్లీ ఎన్నికలు జరిగిన రాష్ట్రాల్లో బీజేపీకి మిశ్రమ ఫలితాలు కనిపిస్తున్నాయి. బీజేపీ ప్రధానంగా మూడు రాష్ట్రాల్లో పోటీదారు. అక్కడ నెగ్గితే వచ్చే ఎన్నికల్లో మళ్లీ జాతీయ స్థాయిలో కమలం హవా ఉండవచ్చని విశ్లేషకులు చెబుతూ వచ్చారు. ఒకవేళ ఆ రాష్ట్రాల్లో కాంగ్రెస్ విజయం సాధిస్తే బీజేపీకి గట్టి పోటీ ఉంటుందని చెప్పవచ్చు. ఇలాంటి నేపథ్యంలో బీజేపీ ఆశలు పెట్టుకున్న ఆ మూడు రాష్ట్రాలు.. రాజస్తాన్, మధ్యప్రదేశ్, చత్తీస్ గడ్ లలో పోలింగ్ ముగిసిన నేపథ్యంలో ఎగ్జిట్ పోల్ ఫలితాలు వెల్లడి అవుతున్నాయి.

వీటిల్లో కమలానికి కొంచెం తీపి కొంచెం చేదు అన్నట్టుగా ఉంది పరిస్థితి. బీజేపీ రాజస్తాన్ ను కోల్పోవడం ఖాయమని ఎగ్జిట్ పోల్ సర్వేలు స్పష్టం చేస్తున్నాయి. ఇండియాటుడే సర్వే అయితే రాజస్తాన్ లో బీజేపీ చిత్తే అని పేర్కొంది. ఇక టైమ్స్ నౌ సర్వే కూడా రాజస్తాన్ లో బీజేపీ ఓడుతుందని పేర్కొంది. అయితే కొద్దో గొప్పో బీజేపీ అక్కడ పరువు నిలబెట్టుకుంటుందని ఈ మీడియా సంస్థ పేర్కొంది.

ఇక మధ్యప్రదేశ్ లో బీజేపీదే విజయం అని టైమ్స్ నౌ పేర్కొంది. బీజేపీ మినిమం మెజారిటీ సాధించవచ్చు అని పేర్కొంది. ఇండియాటుడే ఈ రాష్ట్రంపై స్పందిస్తూ.. పోటాపోటీ పరిస్థితి అని పేర్కొంది. బీజేపీ, కాంగ్రెస్ లు సమస్థాయిలో సీట్లను సంపాదించుకోవచ్చని.. తటస్తులు ఎటు మొగ్గితే వాళ్ల ప్రభుత్వం ఏర్పడవచ్చని పేర్కొంది.

ఇక చత్తీస్ గడ్ లో బీజేపీ నే ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసే అవకాశం ఉందని టైమ్స్ నౌ పేర్కొంది. అయితే ఇండియాటుడేతో సహాఇతర మీడియా సంస్థలు ఇక్కడా పోటాపోటీనే అని.. హంగ్ తరహా పరిస్థితి లేదా కాంగ్రెస్ కు లిటిల్ బిట్ ఎడ్జ్ అని తమ ఎగ్జిట్ పోల్స్ లో పేర్కొన్నాయి.
మరి ఇవన్నీ కొంచెం అస్పష్టంగానే ఉన్నా డిసెంబర్ పదకొండున అసలు కథ తెలిసిపోతుంది.