Home రాజకీయాలు తెలంగాణలో వాళ్లదే అధికారం.. లగడపాటి సంచలన ఎగ్జిట్ పోల్!

తెలంగాణలో వాళ్లదే అధికారం.. లగడపాటి సంచలన ఎగ్జిట్ పోల్!

SHARE

ఒకవైపు తెలంగాణలో తెలంగాణ రాష్ట్ర సమితికే అధికారం దక్కే అవకాశం ఉందని వివిధ ఎగ్జిట్ పోల్స్ చెబుతుంటే.. మాజీ ఎంపీ లగడపాటి రాజగోపాల్ మాత్రం అందుకు పూర్తి భిన్నమైన ఫలితాలను ప్రకటించాడు. ఎన్నికలకు ముందే లగడపాటి మాట్లాడుతూ మహాకూటమికి అనుకూల పరిస్థితి ఉందని ప్రకటించాడు. పోల్ తర్వాత కూడా ఆయన అదే మాటే మాట్లాడటం విశేషం.

కాంగ్రెస్ పార్టీ కూటమికి కనీసం అరవై ఐదు స్థానాలు వచ్చే అవకాశం ఉందని లగడపాటి ప్రకటించాడు. దీనికి పది సీట్లు ఎక్కువ రావొచ్చు లేదా, పది సీట్లు తగ్గవచ్చని పేర్కొన్నాడు. ఓవరాల్ గా మెజారిటీ సీట్లను కూటమి నెగ్గే అవకాశం ఉందని ఈయన పేర్కొన్నాడు.

తెరాస కేవలం ముప్పై ఐదు సీట్లకు పరిమితం అవుతుందని పేర్కొనడం విశేషం. ఇందులో కూడా పది సీట్లను కోల్పోయినా ఆశ్చర్యం లేదని, పది సీట్లను అదనంగా సాధించవచ్చు అని లగడపాటి ప్రకటించాడు. ఇక బీజేపీ ఏడు సీట్లను సాధించవచ్చు అని.. రెండు సీట్లు అటో ఇటో అయ్యే అవకాశాలున్నాయని పేర్కొన్నాడు.

ఎంఐఎం ఆరేడు సీట్లను సాధిస్తుందని ప్రకటించాడు. ఇక ఇతరులు ఏడు నుంచి తొమ్మిది సీట్లలో నెగ్గే అవకాశం ఉందని విశ్లేషించాడు.

ఒకవైపు ఇండియాటుడే తెలంగాణలో కేసీఆర్ స్వీప్ అంటుంటే.. లగడపాటి దానికి పూర్తి భిన్నమైన ఫలితాలను వెల్లడించాడు. మరి లగడపాటి లెక్కలు ఏ మేరకు నిజం అవుతాయో డిసెంబర్ పదకొండున తేలిపోతుంది!